Health Tips: మీరు కొలెస్ట్రాల్ బాధితులా.. అయితే కంగారు పడకుండా ఇలా చెక్ పెట్టండి?
Health Tips: శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం కానీ పరిమితికి మించి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. మన జీవన విధానంలోనూ మన ఆహారంలోని కొన్ని మార్పుల ద్వారా ఈ చెడు కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టవచ్చంట అది ఎలాగో చూద్దాం.
ఇటీవల కాలంలో కొలెస్ట్రాల్ సమస్య బాగా ఎక్కువైంది. దీనికి కారణం చెడు ఆహారపు అలవాట్లు చెడు జీవన విధానాలు. చాలామంది కొలెస్ట్రాల్ ని తేలిగ్గా తీసుకుంటారు కానీ ఆ అశ్రద్ధకి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి మంచిది రెండవది చెడ్డది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది చాలా వ్యాధులకి దారితీస్తుంది కొలెస్ట్రాల్ అనేది మైనం వంటి పదార్థం ఇది రక్తంలో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమవుతాయి.
అయితే చాలామంది గుడ్డు తినడం వలన కొలెస్ట్రాల్ వస్తుంది అని అపోహ పడుతున్నారు కానీ రోజుకు ఒక గుడ్డు తినటం అనేది మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా అవసరం. జానికి మనం తినే ఫాస్ట్ ఫుడ్ లో ఉండే చెడు కొలెస్ట్రాల్ కన్నా గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ చాలా తక్కువ.
అందుకే ఏవి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందో ఒకసారి చూద్దాం. బీన్స్ లోని పీచు చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటుంది దీనిలోని లేసిథిన్ కొవ్వులని కరిగిస్తుంది. అలాగే బ్లాక్ బెర్రీ లో ఉండే విటమిన్లు గుండె రక్త ప్రసన్న వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపటానికి సహాయపడుతుంది. అలాగే పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి సి కాల్షియం ఖనిజల్ల బోనాలు చెడు కొవ్వుని కరిగిస్తాయి. అలాగే బాదం లోని హోలీ యాసిడ్ వ్యాధుల నుంచి గుండెను రక్షిస్తుంది జీడిపప్పు కూడా చెడు కొవ్వులని తగ్గిస్తుంది.
అలాగే వాల్ నట్ లోని ఒమేగా ఫ్యాట్ త్రీ ఆమ్లాలు కూడా చెడు కొలెస్ట్రాల్ని గణనీయంగా తగ్గిస్తాయి. జామ పండు, ద్రాక్ష పళ్ళు లాంటి ఫ్రూట్స్ కూడా కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ బాధితులు ఫాస్ట్ ఫుడ్ ని పక్కన పెట్టి వీటిని ఆహారంలో చేర్చుకుంటే త్వరగానే మీ సమస్యకి చెక్ పెట్టవచ్చు.