Health Tips: వర్షాకాలంలో పాదాలకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి?
Health Tips: వర్షాకాలంలో మనం శరీరానికి తీసుకున్నంత శ్రద్ధ పాదాలకి తీసుకోము. అయితే వర్షం పడినప్పుడు ఎక్కువగా ప్రభావం అయ్యేవి పాదాలే. ఆ పాదాలకి ఇన్ఫెక్షన్లు వస్తే ఒకంతట సర్దుకోవు. అందుకే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ చర్యలు తీసుకోండి.
మన పాదాలు తేమ మరియు తేమతో కూడిన వాతావరణానికి ఎక్కువగా గురవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తడి బూట్లు వలన పాదాలు ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. అందుకే ఈ వర్షాకాలంలో కొన్ని ఫుట్ కేర్ చిట్కాలు చూద్దాము. ముందుగా వర్షంలో తడిచి ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళని శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రండి.
తర్వాత పాదాలని మెత్తని గుడ్డతో తుడిచి వాటిని పొడిగా ఉంచండి. పాదాలు తడిగా ఉండడం వలన దుర్వాసన, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కి గురవుతాయి. అలాగే వర్షంలో షూ కూడా తడుస్తుంది కాబట్టి పాదాలకి ఇన్ఫెక్షన్లతో పాటు పగుళ్లు కూడా వస్తాయి. కాబట్టి షూ సాక్సులు కూడా ఎప్పుడూ పొడిగా ఉన్నవి మాత్రమే వేసుకోండి. ఇంట్లో మాత్రం ఎప్పుడూ చెప్పులతోనే తిరగండి.
వర్షాకాలంలో వీలైనంత మటుకు షూస్ వేసుకోకుండా గాలి తగిలే పాదరక్షలు మాత్రమే వేసుకోండి. పాదాలని బాగా పొడిగా తుడుచుకొని వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్ని చల్లుకోవాలి. అలాగే కాళ్లు గోళ్లు కూడా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. లేదంటే వాటిలో మురికి చేరి దురదలు ఇతర చర్మ వ్యాధులు వస్తాయి.
వర్షాకాలంలో పాదాలను రోజు స్క్రబ్ చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల పాదాలు పగలకుండా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ లేదా లిక్విడ్ సోప్ కలుపుకొని అందులో పది నిమిషాల పాటు మీ పాదాలను పెట్టండి. తర్వాత ఫుట్ స్క్రబ్ తో శుభ్రం చేసుకోండి.
అలాగే ఫ్యూమిస్ స్టోన్ ని ఉపయోగించి ప్రతిరోజు పాదాలని శుభ్రం చేసుకొని తరువాత మాయిశ్చరైసర్ రాసుకోవాలి. దీనివల్ల మృత కణాలు పెరిగిపోవటమే కాకుండా పాదాలకు రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. పాదాలకి చిన్న గాయమైనా కూడా వాటి ద్వారా ఇతర క్రిములు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి.
అందుకే పాదాలను గాయాలవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ గాయాలు అయినట్లయితే తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం. రాత్రి నిద్రపోయే ముందు పాదాలకి కచ్చితంగా యాంటి సెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి.