మీరు బలహీనంగా ఉన్నారా? అయితే వీటిని తినండి
మనం చురుగ్గా ఉండాలంటే మన శరీరంలో తగినంత ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ లేకపోవడం వల్ల సోమరితనంగా అనిపిస్తుంది. అలసటగా కూడా ఉంటుంది. దీనివల్ల ఏ పని చేయలేరు. ఇలాంటి వారు కొన్ని ఆహారాలను తింటే బలంగా అవుతారు.
Fatigue
ఉరుకుల పరుగుల జీవితం వల్ల కడుపు నిండా తినే టైం కూడా లేనివారున్నారు. అసలు ఎలాంటి ఫుడ్ తినాలి? ఎలాంటివి తినకూడదు అన్న విషయాలను తెలుసుకోకుండా తినడం వల్లే ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తీరిక లేని పనుల వల్ల సరిగ్గా తిననివారు కూడా ఉన్నారు. కానీ ఈ అలవాట్ల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడంతో పాటుగా ఒంట్లో శక్తి కూడా ఉండదు. దీనివల్ల ఏ పనీ చేయలేరు. చిన్న చిన్న పనులను చేసినా బాగా అలసిపోతారు. బలహీనంగా ఉంటారు. కంటినిండా నిద్రలేకపోవడం వల్ల కూడా అలసిపోతుంటారు.
Fatigue
శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గితే ఏ వ్యక్తి కూడా ఏ పనీ చేయలేడు. ఇలాంటి వారు తమ రోజువారి ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. ఒంట్లో ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతాయి. ఇందుకోసం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గుడ్లు
గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిలో ఉండే ప్రోటీన్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. గుడ్లలో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినొచ్చు. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి12, సెలీనియం ఇలా ఎన్నో రకాల పోషకాలు గుడ్లలో ఉంటాయి. ఇవి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతాయి.
పాప్ కార్న్
పాప్కార్న్ తృణధాన్యాల నుంచి తయారవుతుంది. దీనిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పాప్ కార్న్ తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. కానీ ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి.
apples
ఆపిల్ పండు
ఆపిల్స్ ఫైబర్ కు మంచి మూలం. రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, క్వెర్సెటిన్, కాటెచిన్, ఫ్లోరైడ్జైన్, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరాన్ని శక్తివంతంగా ఉంటాయి.