మధ్యాహ్నం ఎక్కువ సేపు పడుకుంటే డేంజర్ రోగాలొస్తయ్ జాగ్రత్త..!
మధ్యాహ్నం కునుకు తీసేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి మధ్యాహ్నం పూట కాసేపు నిద్ర పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ అదేపనిగా నిద్రపోతే మాత్రం గుండెపోటు నుంచి ఎన్నో డేంజర్ వ్యాధులు వస్తాయి.

పనిలో అలసట వల్ల మధ్యాహ్నం పూట కాసేపు చిన్న కునుకు తీసే వారు చాలా మందే ఉన్నారు. ఇలా కాసేపు పడుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది. కానీ వీక్ ఆఫ్ వచ్చిన రోజు, ఇంటిదగ్గర ఉండే వారు మధ్యాహ్నం పూట మూడు నాలుగు గంటలు నిద్రపోతుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మన శరీరాలపై, ముఖ్యంగా మన హృదయాలపై చెడు ప్రభావం చూపుతుంది తెలుసా?
మధ్యాహ్నం కునుకుతో బోలెడు లాభాలున్నాయి. అయితే మధ్యాహ్నం పూట 30 నుంచి 45 నిమిషాల సమయం పాటు పడుకుంటేనే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రిపూట తగినంత నిద్ర లేని వ్యక్తుల గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. అయితే 60 నిమిషాల నుంచి 180 నిమిషాల పాటు మధ్యాహ్నం పడుకునే వారికి గుండె , రక్తపోటు స్థాయిలపై భయంకరమైన ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నం ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
high blood pressure
అధిక రక్తపోటుకు దారితీస్తుంది
అధిక రక్తపోటు ప్రమాదకరమైన వ్యాధి. ఇది దీర్ఘకాలిక పగటి న్యాప్స్ తీసుకోవడంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పగటి కునుకు అధిక రక్తపోటు స్థాయిలు, స్ట్రోక్ ప్రమాదాలను కలిగిస్తుంది. ఇది గుండె ఆయుష్షును తగ్గిస్తుంది. గుండె పంపింగ్ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది.
stroke
స్ట్రోక్
జీవితంలో ఎక్కువ భాగం మధ్యాహ్నం కునుకు తీసేవారికి వృద్ధాప్యంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు నిరూపించాయి.
diabetes
డయాబెటిస్ కు కారణమవుతుంది
45 నిమిషాల కంటే ఎక్కువ సేపు మధ్యాహ్నం పడుకునే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.
NAP SLEEPING
అయితే పగటి నిద్ర సమయాలను తగ్గించడం, రాత్రి తగినంత నిద్రపోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన నిద్ర సమయాలు ఇలాంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే రోజూ 30 నుంచి 40 నిమిషాల పాటే మధ్యాహ్నం కునుకు తీయండి. ఇది మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.