Health Tips: కాఫీ తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు.. కానీ ఈ పద్ధతిలో మాత్రమే తాగాలి!
HealthTips: సాధారణంగా కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు కానీ కాఫీ తాగటం వలన బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని ప్రత్యేక పద్ధతులలో మాత్రమే కాపీ తాగాలంట, అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చాలామంది కాపీ తో రోజుని ప్రారంభిస్తారు. ఒక పూట కాపీ మిస్ అయినా ఆ రోజంతా ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. కాఫీ లో ఉండే కెఫెన్ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. అయితే ఇటువంటి కాఫీ కాకుండా బరువు తగ్గటం కోసం కొన్ని రకాల కాఫీని సజెస్ట్ చేస్తున్నారు నిపుణులు.
అదేమిటో చూద్దాం. ముందుగా బ్లాక్ కాఫీ.. బ్లాక్ కాఫీ తాగటం వలన శరీరంలో ఉండే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాదు కాఫీలో క్లోరోజనిక్ యాసిడ్ కొవ్వుని కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంట్లో చిటికెడు జాజికాయ పొడిని జోడించడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అలాగే డార్క్ చాక్లెట్ కాఫీ తాగటం వలన యాంటీ ఆక్సిడెంట్లు, మెనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు కాఫీతో కలవడం వలన జీవక్రియ రేటు పెరగటంతో పాటు శరీరంలో బరువు తగ్గుదలకు కూడా సహాయపడతాయి.
అలాగే ఈ కాఫీ తాగడం వలన కడుపు నిండుగా అనిపించి ఆకలి ఫీలింగ్ ని చంపేస్తుంది. అలాగే నిమ్మకాయతో కాఫీ తాగటం వలన కూడా బరువుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.విటమిన్ సి జీవక్రియను పెంచడానికి మరియు కొవ్వును కాల్చే హార్మోన్లను సక్రియం చేయడానికి సహాయపడతాయి.
ఈ పానీయం శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా సహాయపడుతుంది. అదేవిధంగా ఒక కప్పు బ్లాక్ కాఫీలో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి..
మరియు తేనే కలిపి తీసుకోవడం వలన దాల్చిన చెక్క కాఫీ రెడీ అవుతుంది. దీనిని ప్రతిరోజు తాగటం వలన శరీరం యొక్క బరువు త్వరగా కోల్పోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ పద్ధతులలో మాత్రమే కాఫీని సేవించి బరువు తగ్గే ప్రక్రియను కొనసాగించండి.