MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • కోపం వల్ల మీ గుండె పగిలిపోతుందని తెలుసా? ఊహించని ఆరోగ్య సమస్యలు ఇవిగో

కోపం వల్ల మీ గుండె పగిలిపోతుందని తెలుసా? ఊహించని ఆరోగ్య సమస్యలు ఇవిగో

మీరు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారా? రెండు నిమిషాలు కోప్పడితే 6 గంటల ఇమ్యూనిటీ సిస్టం దెబ్బతింటుందని మీకు తెలుసా? అంతేకాకుండా హార్ట్ ఎటాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. కోపం వల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి నిపుణులు, వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 31 2025, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా కోపంలో రెండు రకాలు ఉంటాయి. ఒక పెద్ద తప్పు జరిగితే కోప్పడడం. ప్రతి చిన్న విషయానికి కోప్పడటం. ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు కోపం తెచ్చుకున్నారంటే అర్థం ఉంటుంది. ఆ తప్పును సరిదిద్దడానికి కోప్పడడం సహజం. కానీ చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా? శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

25

శారీరకంగా వచ్చే సమస్యలు...
ఎప్పుడైనా వచ్చే కోపం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ చిన్న చిన్న విషయాలకి కోప్పడితే వెన్నెముక, మెడ భుజాల వద్ద నొప్పులు వస్తాయి. ఇది దీర్ఘకాలలో తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. తరచూ కొప్పడే వారికి బ్లడ్ ప్రెజర్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో త్వరగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

35

కేవలం రెండు నిమిషాలు కోప్పడితే బ్లడ్ లో స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. కోపం తగ్గిపోయినా అవి బ్లడ్ లోనే నాలుగు గంటల పాటు ఉంటాయి. దీనివల్ల 6 గంటల పాటు ఇమ్యూనిటీ సిస్టం దెబ్బతింటుంది. పిచ్చి కోపం వల్ల బ్రీతింగ్ సమస్యలు వస్తాయి. హైబీపీ వచ్చే అవకాశాలుంటాయి.

45

నరాలు బాగా ఒత్తిడికి గురై తరచూ తలపోటు వస్తుంది. కేవలం రెండు నిమిషాల కోపం ఎనిమిది గంటల వరకు చర్మంపై ప్రభావం చూపిస్తుంది. అంటే చర్మం పనితీరు దెబ్బతిని భవిష్యత్తులో అనేక చర్మ సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే ముడతలు ఏర్పడి పెద్దవారిలా కనిపించే అవకాశం ఉంటుంది.

 

55

మానసికంగా వచ్చే సమస్యలు..
చిన్న చిన్న విషయాలకి కోప్పడే వారి వల్ల అందరికీ ఇబ్బందే. స్నేహితులు బంధువులతో తరచూ గొడవలు అవుతాయి. కోపానికి కారణం లేకపోతే సొంతవాళ్లు కూడా దూరమైపోతారు. అనవసరమైన విషయాల గురించి కోప్పడే వారిపై సొసైటీలో మంచి పేరు ఉండదు. 

చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకునేవారు మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్ససైజ్, వాకింగ్ లాంటివి చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vitamin B12: వెజిటేరియన్స్ ఈ 5 ఫుడ్స్ తో B12 లోపానికి చెక్ పెట్టొచ్చు
Recommended image2
Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు తింటే కలిగే 7 లాభాలు ఇవే!
Recommended image3
Cumin Saunf Ajwain Water: 11 రోజులపాటు పరగడుపున జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved