ప్లేట్ లెట్ కౌంట్ పెరగాలంటే ఇలా చేయండి
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్లేట్ లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఇవి లేకపోతే చనిపోతారు. అయితే డెంగ్యూ, మలేరియా బారిన పడ్డవారిలో ప్లేట్ లెట్ కౌంట్ చాలా తగ్గుతుంది. దీంతో రోగి పరిస్థితి విషమంగా మారుతుంది. అయితే కొన్ని చిట్కాలతో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవచ్చు. అదెలాగంటే?
Image: Freepik
వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా నీరు నిల్వడం, దుమ్ము పేరుకుపోవడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
ప్రస్తుతం దేశంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ స్టార్టింగ్ లక్షణాలు వైరల్ ఫీవర్ మాదిరిగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అయితే డెంగ్యూ, మలేరియా జ్వరాల వల్ల ప్లేట్ లెట్స్ వేగంగా తగ్గిపోతాయి. ఇది రోగి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. మరి ఈ ప్లేట్ లెట్ సంఖ్య పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
papaya leaves
బొప్పాయి ఆకులు
బొప్పాయి ఆకులు కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ ను బాగా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతాయి. ఇందుకోసం బొప్పాయి ఆకుల రసాన్ని తాగొచ్చు. ఈ ఆకులతో జ్యూస్ ను తయారు చేయడానికి బొప్పాయి ఆకులను తీసుకుని నీట్ గా కడగండి. మిక్సీలో గ్రైండ్ చేసి దాన్నుంచి రసాన్ని తీయండి. దీంట్లో1 టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తాగొచ్చు. ఇది ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది.
కలబంద
కలబంద మన ఆరోగ్యానికి వరం కంటే తక్కువేం కాదు. అవును ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాలు ఏర్పడటానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉపయోగించడానికి ఒకటి లేదా రెండు టీస్పూన్ల కలబంద జెల్ ను పండ్ల రసంలో మిక్స్ చేసి తీసుకోండి. ఇలా రోజుకు రెండుసార్లు తాగడం వల్ల మీ ప్లేట్ లెట్ సంఖ్య బాగా పెరుగుతుంది.
బీట్ రూట్
బీట్ రూట్ జ్యూస్ మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి ఎంతో సహాయపడుతుంది. రెగ్యులర్ గా బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల ప్లేట్ లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ జ్యూస్ అలసట, నీరసాన్ని కూడా పోగొడుతుంది.
సొరకాయ జ్యూస్
ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడంలో సొరకాయ ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఐరన్ కంటెంట్ తగిన మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ప్లేట్ లెట్స్ కౌంట్ పెంచుకోవాలంటే సొరకాయ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవచ్చు.
దానిమ్మ జ్యూస్
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి దానిమ్మ మన ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధించే లక్షణాలు కూడా దీనిలో ఉన్నాయి.