ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వచ్చినప్పుడు ఇలా చేస్తే వెంటనే తగ్గుతాయి
చాలా మందికి పొద్దు పొద్దున్నే జీర్ణ సమస్యలు వస్తుంటాయి. కానీ వీటి ప్రభావం రోజంతా ఉంటుంది. అందుకే ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గ్యాస్
చాలా మందికి ఉదయం పూటే ఎక్కువగా గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. రాత్రిపూట లేట్ గా తినడం, రాత్రి హెవీగా తినడం, అజీర్ణం వంటి కారణాల వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి.
కానీ ఈ జీర్ణ సమస్యలు రోజును పాడుచేస్తాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే గనుక ఉదయాన్నే వచ్చే ఈ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు
ఉదయాన్నే మీకు గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తే వెంటనే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లను తాగండి. ఇందుకోసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేయండి. ఇది మీ కడుపు ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. దీంతో మీకు ఈ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
సోంపు
సోంపు ఉదయాన్నే వచ్చే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. వీటిని తింటే కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తొందరగా తగ్గుతాయి. ఇందుకోసం ఉదయం భోజనం తర్వాత టీ స్పూన్ సోంపును నమలండి. ఇది ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అల్లం టీ
అల్లం టీ జీర్ణక్రియకు మంచి మేలు చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. మీరు ఉదయాన్నే అల్లం టీని తాగడం అలవాటు చేసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాలు తగ్గుతాయి. అలాగే పేగు కండరాలు సడలుతాయి. గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతంది. ఇందుకోసం అల్లం టీని ఉదయం పరిగడుపున తాగాలి.
అలోవెరా జ్యూస్
కలబంద జ్యూస్ జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు గనుక మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా ఒకటి లేదా రెంటు టేబుల్ స్పూన్ల కలబంద జ్యూస్ ను తాగితే కడుపు చికాకు తగ్గుతుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
అరటి లేదా బొప్పాయి
గ్యాస్ సమస్యలను మీరు బొప్పాయి, అరటి వంటి పండ్లతో కూడా తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే ఆల్కలీన్ స్వభావం కడుపు ఆమ్లాలను తటస్తం చేస్తాయి. అలాగే ఈ పండ్లలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే బొప్పాయి పండులో ఉండే పాపైన్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ను తగ్గిస్తుంది. ఈ పండ్లు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.