Piles Remedies: పైల్స్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
గజిబిజి లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా ప్రస్తుతం చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

ప్రస్తుత జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిలో మొలల సమస్య వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నాారు. మొలలు వస్తే ఆ బాధ చెప్పలేనిది. కూర్చోలేరు. నిల్చోలేరు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అవెంటో చూసేయండి.
మసాలాలు, వేయించిన ఆహారాల వల్ల పిల్లలు, పెద్దలు ఎక్కువగా మలబద్ధకంతో బాధపడుతున్నారని డాక్టర్లు అంటున్నారు. మలబద్ధకం ఎక్కువైతే మొలలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నీళ్లు తక్కువ తాగితే కూడా మలబద్ధకం సమస్య వస్తుందని అంటున్నారు. మరి వీటికి పరిష్కారం ఏంటో ఇక్కడ చూద్దాం.
సరిపడా నీళ్లు
ఫ్రై ఫుడ్, జంక్ ఫుడ్స్ తినకుండా ఉంటే చాలావరకు ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. తగినంత నీళ్లు తాగడం, వ్యాయామం చేయడం ద్వారా కూడా పైల్స్ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
మైదాతో చేసిన ఆహారాలు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మెక్సికన్ చిప్స్, మైదాతో చేసిన కొన్ని ఆహారాలు శరీరంపై చెడు ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. ఇలాంటివి తినడం వల్ల రక్తనాళాల్లో మంట, వాపు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
వేప నీళ్లు
పైల్స్ సమస్యతో బాధపడేవారు వేప ఆకుల నీళ్లను ఆ ప్రదేశంలో రాయాలి. ఐస్ క్యూబ్స్ ను ఒక క్లాత్ లో వేసి మొలలున్న దగ్గర పెడితే అక్కడ వచ్చే దద్దులు, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. అలోవెరా, బొప్పాయి కూడా పైల్స్ నివారణకు చక్కగా ఉపయోగపడుతుంది.
ఇసబ్‌గోల్ తీసుకుంటే?
భోజనానికి ముందు ఒక టీస్పూన్ ఇసబ్‌గోల్ తీసుకుంటే మంచిది. ఇది పేగు కదలికలకు సహాయపడుతుంది. కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. వ్యాయామం చేయండి. మైదాతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
యోగా, వాకింగ్
ప్రతిరోజు వాకింగ్, యోగా చేయడం ద్వారా మొలలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మొలలను నివారించవచ్చు. మొలల సమస్యను త్వరగా గుర్తించడం ముఖ్యం. వీలైనంత వరకు ఈ సమస్యకు సహజ పద్ధతులతో చికిత్స చేయడం మంచిది.