Health Tips: డ్రై ఫ్రూట్స్ అతిగా తినకూడదా.. అంత పరిమాణంలోనే తీసుకోవలా?
Health Tips: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని అతిగా తినటం వలన ఆరోగ్యం బాగుపడదు సరే కదా ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలో ఎన్ని తినాలో తెలుసుకుందాం.
ఆరోగ్యం బాగోకపోయినా, శరీరం బరువు తగ్గాలన్నా, హెల్దీ డైట్ కోసం అయినా డాక్టర్లు అందరూ డ్రైఫ్రూట్స్ నే సిఫారసు చేస్తారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ని ఒక మోతాదుకి మించి తినడం వలన వచ్చే ఆరోగ్యం సంగతి పక్కనపడితే ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది.
అందుకే డ్రై ఫ్రూట్స్ ని ఎంత మోతాదులో తినాలి ఎలా తినాలి చూద్దాం. ముందుగా పిస్తా సంగతి చూద్దాము ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.
అలాగే జీడిపప్పు తినటం వల్ల పెద్ద ఆసియంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు అలా అని వారానికి 28 జీడిపప్పులు కన్నా ఎక్కువ తినటం మంచిది కాదు అంటున్నారు వైద్యులు.
ఎండు ద్రాక్షని ఎంత మోతాదులో తిన్నా పర్వాలేదు ఇందులో విటమిన్ బి పొటాషియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండు ద్రాక్ష తినవచ్చు. అలాగే వాల్ నట్స్ రోజుకి మూడు నాలుగు నుంచి తీసుకోకూడదు. వాల్నట్స్ మీద ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదు.
కానీ 90 శాతం ఆంటీ ఆక్సిడెంట్సు ఫెనోలికే యాసిడ్స్ ఈ స్కిన్ లోనే ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. అలాగే బాదం గింజలు రోజుకి నాలుగు నుంచి ఏడు గింజల వరకు తినటం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఖర్జూరం ఇది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది.
ఇందులో ప్రాక్టోజ్ రిచ్ గా ఉంటుంది మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. అలాంటి ఈ ఖర్జూరాన్ని రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. అయితే నట్స్ ని నేరుగా కాకుండా నానబెట్టి తినటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.