- Home
- Life
- Health
- Health Tips: గుండెపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న పురుషులు.. చేజేతులా ప్రమాదం కొని తెచ్చుకుంటున్న వైనం!
Health Tips: గుండెపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న పురుషులు.. చేజేతులా ప్రమాదం కొని తెచ్చుకుంటున్న వైనం!
Health Tips: సాధారణంగా ఆరోగ్యం విషయంలో మగవారు అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యమే వారి ప్రాణాల మీదికి తీసుకువస్తుందని గ్రహించలేకపోతున్నారు. అందుకే గుండెపోటు కి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు మీకోసం.

సాధారణంగా మగవారు పని ఒత్తిడి కారణంగానో, మరి ఇంకా ఇతర సమస్యల కారణంగానో అయినా వారి యొక్క ఆరోగ్యం మీద అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వారి ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సూచనలు కనిపించిన ఏమీ కాదులే అనే ఒక నిర్లక్ష్య ధోరణి వారిని మరణం అంచుల వరకు తీసుకువెళ్తుంది.
అందుకే మీ శరీరం మీకు పంపించే సూచనలని అశ్రద్ధ చేయకండి. అలాగే గుండెపోటు వచ్చే వయసు కాదు అని నిర్లక్ష్యం చేయకండి. ఈ జబ్బులో తాత తండ్రుల నుంచి వస్తున్నాయి దీనిని తప్పించుకునే పరిష్కారం లేదు అని ఆలోచిస్తూ కూర్చోకండి.
ఎందుకంటే సమస్యని పూర్తిగా తీసివేయలేకపోవచ్చు కానీ ఆయుః ప్రమాణం పెంచుకునే చికిత్స విధానం మనకి అందుబాటులో ఉందని గ్రహించండి. నాది గుండెపోటు వచ్చే వయసు కాదు అని నిర్లక్ష్యం చేయకండి. నేటి ఏం జీవన విధానంలో మన మీద పడే ఒత్తిడి ఆహార విధానాలు చిన్న వయసులోనే గుండెపోటు కి దారితీస్తుంది.
మీకు గుండెపోటు వచ్చే ముందు శరీరం కొని సూచనలని పంపిస్తుంది వాటిని గమనించి సరియైన వైద్య పరీక్షలు చేయించుకోండి. అలాగే సొంత ట్రీట్మెంట్ చేసుకోకండి తలనొప్పికి జలుబుకి అంటూ ఇష్టం వచ్చిన టాబ్లెట్లు వైద్యుని సలహా లేకుండా వేసుకోకండి.
ఆ మందులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి కానీ దీర్ఘకాలంలో వాటి ప్రభావం గుండె మీద పడతాయని గ్రహించండి. అలాగే అంగస్తంభనను పొందటంలో లేదా నిర్వహించడంలో సమస్యలు తరచుగా మీ మానసిక స్థితి కంటే మీ హృదయానికి సంబంధించినవి అని గుర్తించండి.
a
పురుషాంగానికి రక్తప్రసన్నలో సమస్య కారణంగా నపుంసకత్వం కలుగుతుంది. దెబ్బతిన్న రక్తనాళాలు గుండె యొక్క రక్తనాళాలకు నష్టం కలిగించవచ్చు. ఈ ప్రభావం మొత్తం మీ గుండెపై ఒత్తిడిని పెంచి గుండెపోటు రావడానికి అవకాశం ఉంది కాబట్టి పురుషులు.. జాగ్రత్త పడండి.