ఈ పండ్లు మీ గుండెను కాపాడుతాయి తెలుసా?
అనారోగ్యకరమైన జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. మెరుగైన జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

heart
గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలే గుండె జబ్బులకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లను అనుసరిస్తే మీ గుండె పదిలంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
బెర్రీలు
బెర్రీలు ఎన్నో రోగాల ముప్పును తప్పిస్తాయి. వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్బెర్రీలు, కోరిందకాయలు వంటి వివిధ రకాల బెర్రీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
orange benefits
ఆరెంజ్
నారింజ మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నారింజ ఒక సిట్రస్ పండు. విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆపిల్
రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆపిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్న పండు. యాపిల్స్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
బొప్పాయి
బొప్పాయి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన జుట్టు, చర్మం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బొప్పాయి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
అవొకాడో
అవొకాడో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పండ్లలో ఒకటి. ప్రతిరోజూ ఒక అవొకాడో పండును తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి.
అరటిపండ్లు
అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. అరటిపండ్లను రోజూ తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు ముప్పు తప్పుతుంది.