MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పళ్లను ఎప్పుడెప్పుడు తోమొద్దో తెలుసా?

పళ్లను ఎప్పుడెప్పుడు తోమొద్దో తెలుసా?

పళ్లు తోమితేనే నోట్లోని క్రిములన్నీ బయటకు పోతాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని సందర్బాల్లో పళ్లను తోమడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడెప్పుడంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 27 2024, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నోటి, దంత ఆరోగ్యానికి రెగ్యులర్ గా బ్రష్ చేయాలి. కొంతమంది రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తే.. కొందరు మాత్రం పొద్దున్న, రాత్రి రెండు సార్లు బ్రష్ చేస్తుంటారు. నిజానికి రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. దీనివల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసనకు కారణం నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడమే.  అందుకే పళ్లను సరిగ్గా తోమాలి. అయితే పళ్లను మరీ ఎక్కువ సేపు తోమడం కూడా అస్సలు మంచిది కాదు. మరి ఏయే సమయాల్లో బ్రష్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

తిన్న వెంటనే

కొంతమంది తిన్న వెంటనే పళ్లను తోముతుంటారు. కానీ ఇలా తోమడం అస్సలు మంచిది కాదు. నిపుణుల ప్రకారం.. మనం ఆహారం తినేటప్పుడు మన నోరు ఆమ్లంగా మారుతుంది. ఈ ఆమ్ల స్థితిలో మీరు బ్రష్ చేస్తే అది దంతాల ఎనామెల్ ను నాశనం చేస్తుంది. అందుకే  తిన్న వెంటనే బ్రష్ చేయకూడదని నిపుణులు, డాక్టర్లు చెప్తారు. 
 

34
brushing

brushing

వాంతులు అయిన వెంటనే

వాంతులు అయిన వెంటనే కూడా పళ్లను తోముకోవడం మంచిది కాదు. నిపుణుల ప్రకారం.. మనం వాంతులు చేసుకున్నప్పుడు మన కడుపులోని చాలా ఆమ్లాలు నోట్లోకి వస్తాయి. అందుకే ఈ సమయంలో పళ్లను తోముకోకూడదు. ఒకవేళ తోమితే దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకే దీనికి బదులుగా వాంతులు అయినప్పుడు కేవలం మీ నోటిని మాత్రమే కడగండి. 30 నిమిషాల తర్వాతే పళ్లను తోముకుంటే సరిపోతుంది. 
 

44

కాఫీ తాగిన వెంటనే

కాఫీ తాగిన వెంటనే కూడా పళ్లను తోమకూడదు. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల నోటిలో ఆమ్లంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ దంతాలను తోమితే దంత ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకే ఈ సమయంలో కూడా బ్రష్ చేయకండి. కావాలనుకుంటే 20-30 నిమిషాల తర్వాత పళ్లను తోమండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image2
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Recommended image3
Tea: టీ చేయడానికి ఏ గిన్నె బెటర్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved