MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • 7 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా? అయితే మీ ఆరోగ్యం పని అంతే..!

7 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా? అయితే మీ ఆరోగ్యం పని అంతే..!

మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. ఎందుకంటే నిద్ర తిరిగి మన అలసిన శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. మీకు తెలుసా? నిద్రలోనే సగం రోగం తగ్గుతుంది. అందుకే ప్రతి రోజూ కంటినిండా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తారు. అయితే కొంతమంది చాలా తక్కువ సమయమే నిద్రపోతారు. కానీ ప్రతి రోజూ 7 గంటలకంటే తక్కువ సమయం నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 12 2024, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. ఎందుకంటే నిద్రే మన శరీరాన్ని తిరిగి ఎనర్జిటిక్ గా మారుస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ రెగ్యులర్ గా కంటినిండా నిద్రపోకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డాక్టర్  ను సంప్రదించాలి. ఇక సోషల్ మీడియాలో ఎక్కువ సేపు యాక్టీవ్ గా ఉండేవారు కూడా ప్రతి రోజూ 8 గంటలు నిద్రపోయేలా షెడ్యూల్ చేసుకోవాలి. సగటున ఒక వ్యక్తికి రాత్రిపూట 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. మరి నిద్రలేమితో వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మెమోరీ పవర్ తగ్గడం

అవును నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏకాగ్రత, శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందుకే రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటైనా నిద్రపోయేలా చూసుకోండి. 
 

38

ఇమ్యూనిటీ పవర్

మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం పడుతుంది. తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా మీకు ఎన్నో వ్యాధులు, అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు. 
 

48

మానసిక ససమస్యలు

మీరు సరిగ్గా నిద్రపోకపోతే.. ఉదయం లేచిన వెంటనే చిరాకు కలుగుతుంది. ఆ రోజంతా మీరు చిరాకుగానే ఉంటారు. అలాగే ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశం కూడా ఉంది.
 

58

బరువు పెరగడం

నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఆకలి, అనారోగ్యకరమైన ఆహారం కోసం మీలో కోరికలను పెంచుతుంది. దీంతో మీరు విపరీతంగా తిని బాగా బరువు పెరుగుతారు. 
 

68

గుండె సంబంధిత వ్యాధులు

నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన రోగాలేమీ రాకూడదంటే మీరు కంటినిండా నిద్రపోవాలి.
 

78

డయాబెటీస్

నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

88

చర్మ సమస్యలు

నిద్రలేమి వల్ల కూడా ఎణ్నో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా మీ చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల మీ చర్మం పొడిబారడం, ముడతలు పడటం, తామర వంటి చర్మ సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved