పెరుగు తింటే మంచిదే కానీ... వీటితో మాత్రం కలిపి తినకండి...!
ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది.
curd
ఎండాకాలం వచ్చింది అంటే... మన బాడీలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకోసమే... ఎండాకాలం కచ్చితంగా పెరుగు తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇది నిజం. గట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చినా సరే పెరుగును కొన్ని వస్తువులతో మాత్రం అస్సలు కలిపి తీసుకోకూడదు. పెరుగును వేటితో కలిపి తీసుకోకూడదో ఓసారి చూద్దాం...
ఆయిల్ ఫుడ్స్: వేపుడు పదార్థాలు, పరాటాలు, చపాతీలు, పూరీలు పెరుగుతో తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
చేపలు: మాంసం , శాఖాహారం ప్రోటీన్లు కలిసి ఉండని విధంగా, చేపలు , పెరుగు ఎప్పుడూ కలిసి ఉండవు. అతిగా తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.
milk
పాలు: పాలు మన శరీరంలో ఎసిడిటీని పెంచుతాయి. కాబట్టి పెరుగుతో కలిపి తింటే గుండెల్లో మంట , గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి పాలు, పెరుగు కలిపి తినకూడదు.
Onions
ఉల్లిపాయ: చాలామంది ఉల్లిపాయలు , పెరుగు రెండింటినీ కలిపి తింటారు. అయితే ఈ రెండూ ఒకదానికొకటి పొంతన కుదరవని చాలా మంది అంటున్నారు. అలా తినడం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది. అందుకే ఈ రెండింటినీ కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి.
mango
మామిడి: మామిడిలో వేడెక్కించే గుణాలు ఉన్నాయి. అయితే పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. అందువల్ల ఈ రెండూ కలిస్తే అజీర్తి వచ్చే అవకాశం ఎక్కువ.
పప్పు: పప్పును పెరుగుతో కలిపి తింటే వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి.. పెరుగున్నంలో పప్పు కలుపుకొని తినే అలవాటు ఉంటే.. దానిని వెంటనే ఆపేయండి..