MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • ఇకపై పీరియడ్స్ నొప్పికి ఆ ట్యాబ్లెట్స్ ను వాడకండి.. లేదంటే సమస్యలొస్తయ్..

ఇకపై పీరియడ్స్ నొప్పికి ఆ ట్యాబ్లెట్స్ ను వాడకండి.. లేదంటే సమస్యలొస్తయ్..

పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నొప్పి ఎటూ కదలనీయదు. ఈ నొప్పిని తట్టుకోలేక చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు. కొంతమంది అయితే నొప్పిని భరించలేక రెండు మూడు ట్యాబ్లెట్లను కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు మెఫ్తాల్ అనే ట్యాబ్లెట్ ను ఎక్కువగా వాడుతారు. కానీ వీటివల్ల ఎన్నో సమస్యలొస్తాయని ఐపీసీ హెచ్చరికలు జారీ చేసింది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 08 2023, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
meftal

meftal

పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది ఆడవారు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.  ఇలాంటి వాటిలో మెఫ్తాల్ ఒకటి. చాలా మంది పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు వీటినే వాడుతుంటారు. అదికూడా డాక్టర్ ను సంప్రదించకుండా. కానీ వీటి వాడకంపై ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) డాక్టర్లు, రోగులకు డ్రగ్ సేఫ్టీ అలర్ట్ ను జారీ చేసింది. విషయం ఏంటంటే.. ఈ ట్యాబ్లెట్ లో మెఫానమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మీకు డ్రస్ సిండ్రోమ్ అనే సమస్యను కలిగిస్తుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ను ..పీరియడ్స్ నొప్పి, తిమ్మిరి, ఆర్థరైటిస్ నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి బాగా వాడుతారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మందుల వాడకం వల్ల ఎవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డాక్టర్లు, రోగులు వెంటనే ఐపీసీ వెబ్సైట్ లో నివేదించాలని హెచ్చరించింది. అలాగే వీటిని వీటిని వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలైనా వస్తున్నాయేమోనని గమనించాలని సూచించింది. అయితే దీనివల్ల ప్రతిఒక్కరూ ప్రభావితం అవుతారని కాదు. కానీ దీని గురించి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అసలు ఈ ట్యాబ్లెట్ వాడకం వల్ల వచ్చే డ్రెస్ సిండ్రోమ్ అంటే ఏంటి? దీని లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

36
డ్రస్ సిండ్రోమ్

డ్రస్ సిండ్రోమ్

డ్రస్ సిండ్రోమ్ అంటే ఏంటి?

డ్రేస్ సిండ్రోమ్ అంటే డ్రగ్ రాష్ విత్ ఇసినోఫిలియా, సిస్టమాటిక్ సింప్టమ్స్ సిండ్రోమ్. ఇది ఒక మందు వల్ల కలిగే అలెర్జీ. కాగా ఇది ఆ మందుకు మన రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం వల్ల వస్తుంది. అయితే ఇది హైపర్సెన్సిటివిటీ ప్రతిచర్యకు కారణమవుతుంది. దీనివల్ల మన శరీరంలోని అవయవాలు, చర్మం ప్రభావితం అవుతాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఇక ఈ డ్రస్ సిండ్రోమ్ లక్షణాలు వెంటనే కనిపించవు. అంటే రెండు వారాల నుంచి ఎనిమిది వారాల తర్వాత కనిపిస్తాయి. ఇది దాదాపుగా 10 శాతం మందిని ప్రభావితం చేస్తుంది 
 

46
periods

periods

డ్రస్ సిండ్రోమ్ లక్షణాలు 

చర్మంపై దద్దుర్లు
జ్వరం
ఇసినోఫిలియా
ముఖం వాపు
మూత్రపిండాలు, కాలేయం లేదా ఇతర అవయవాల వాపు లేదా పనిచేయకపోవడం
వాపు శోషరస కణుపు

56

దీనికి చికిత్స ఏంటి? 

మీరు ఈ సమస్య బారిన పడకూడదంటే.. డ్రెస్ సిండ్రోమ్ కు కారణమయ్యే మందులను వాడటం పూర్తిగా మానేయండి. ఇది ఈ ప్రతిచర్యను పెంచదు. ఆ తర్వాత డ్రస్ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. దీనిలో చర్మపు దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. 
 

66
Image: Getty

Image: Getty

జీర్ణశయాంతర సమస్యలు 

ఈ ట్యాబ్లెట్స్ వాడకం వల్ల జీర్ణశయాంతర సమస్యలు కూడా వస్తాయి. మెఫ్టాల్ వంటి మందులను ఎక్కువ కాలంగా ఉపయోగిస్తే రక్తస్రావం, కడుపు పూతలు వంటి సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. జీర్ణశయాంతర సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇతర ఎన్ఎస్ఎఐడిలు లేదా యాంటికోయాగ్యులెంట్లను ఒకేసారి ఉపయోగించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved