MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • మిల్క్ టీ, బ్లాక్ టీ.. రెండింటిలో ఏది మంచిదంటే?

మిల్క్ టీ, బ్లాక్ టీ.. రెండింటిలో ఏది మంచిదంటే?

మనలో కొంతమంది మిల్క్ టీని తాగితే.. మరికొంతమంది మాత్రం బ్లాక్ టీని తాగడానికి ఇష్టపడతారు. ఏదేమైనా ఈ రెండు మనల్ని ఉత్తేజంగా మారుస్తాయి. కానీ వీటిలో మన ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 20 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మనలో చాలా మంది టీ తోనే డేను స్టార్ట్ చేస్తారు. కప్పు టీ గానీ కాఫీ గానీ లేనిదే ఏ పనీ ముట్టు కోని వారు కూడా ఉన్నారు.  ఇక కొంతమంది అయితే రోజుకు మూడు నాలుగు కప్పుల  టీని కూడా తాగుతుంటారు. అయితే కొంతమంది మిల్క్ టీని ఇష్టపడితే.. మరికొంతమంది మాత్రం బ్లాక్ టీని తాగడానికి ఇష్టపడతారు. ఈ రెండూ మనకు మేలు చేస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
hot black tea

hot black tea

బ్లాక్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు...

బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్స్ వంటి పాలీఫెనాల్స్ మెండుగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు మనల్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. బ్లాక్ టీని రెగ్యలర్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

37

బ్లాక్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్త నాళాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. బ్లాక్ టీలో  ఉండే కెఫిన్ కంటెంట్ మన నిద్రమత్తును వదిలిస్తుంది. అలాగే అభిజ్ఞా పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే సమ్మేళనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీలో ఉండే పాలీఫెనాల్స్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

47

బ్లాక్ టీలోని టానిన్ జీర్ణక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇవి పేగు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. బ్లాక్ టీ లో ఉండే పాలీఫెనాల్స్ జీవక్రియను పెంచుతాయి. దీంతో కొవ్వు శోషణ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. 

57

మిల్క్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు

మిల్క్ టీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిల్క్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మిల్క్ టీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది అప్రమత్తత, అభిజ్ఞా పనితీరును పెంచుతుంది.

67


మిల్క్ టీ, బ్లాక్ టీ.. రెండింటిలో ఏది మంచిదంటే?

బ్లాక్ టీ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. నిజానికి బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయెజనకరంగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు కనీసం రెండు కప్పుల బ్లాక్ టీ తాగడం వల్ల ఏదైనా కారణంతో మరణించే ప్రమాదాన్ని 9-13 శాతం తగ్గించొచ్చు.
 

77
milk tea

milk tea

మిల్క్ టీలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ టీలో షుగర్ ఎక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. పాల టీ ఆందోళన,  నిరాశ వంటి మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు ఇది నిద్ర సమస్యలను కలిగిస్తుంది. అలాగే మొటిమలు, మలబద్దకానికి కూడా కారణమవుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved