MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • చలికాలమని నీళ్లను తక్కువగా తాగుతున్నరా? అయితే జాగ్రత్త ఇబ్బందుల్లో పడతారు

చలికాలమని నీళ్లను తక్కువగా తాగుతున్నరా? అయితే జాగ్రత్త ఇబ్బందుల్లో పడతారు

చలికాలం మొదలైంది. ఉదయం, రాత్రి వేళల్లో విపరీతమైన చలి పెడుతోంది. అయితే చాలా మందికి చలివల్ల దాహం కాదు. దీంతో చాలా మంది నీళ్లను అస్సలు తాగరు. కానీ నీళ్లను తాగడం మానేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.   

2 Min read
Author : R Shivallela
Published : Oct 26 2023, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చలికాలం స్టార్ట్ అవ్వడంతో విపరీతంగా చలి పెడుతోంది. అయితే ఈ సీజన్ లో చాలా మంది నీళ్లను తక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే చలికాలంలో దాహంగా అనిపించదు. అలా అని మీరు నీళ్లను తాగకుండా ఉంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అవును మన శరీరంలో అవసరమైన వాటికంటే నీళ్లు తక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Getty

Image: Getty

కాలాలతో సంబంధం లేకుండా  ప్రతి రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగాలి. వాటర్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కొంతమంది దీనికంటే ఎక్కువ నీళ్లను తాగుతుంటారు. కానీ ప్రతి ఒక్కరి శరీర కూర్పు భిన్నంగా ఉంటుంది. అందుకే దీనికి అనుగుణంగా ఎన్ని గ్లాసుల నీటిని తాగాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైన నీటిని తాగడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

35
Image: Getty

Image: Getty

చలికాలంలో  చలివల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో రోగాలు వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే? ప్రతిరోజూ మూడు లీటర్ల నీటిని తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వయస్సు, శారీరక శ్రమ, గర్భధారణను బట్టి కూడా మన శరీరానికి నీటి అవసరం మారుతుంది. అందుకే మన శరీర కూర్పు ప్రకారం నీటిని తాగడం ముఖ్యం. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో మీకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అందుకే చలికాలమైనా, వానాకాలమైనా నీటిని పుష్కలంగా తాగడం ముఖ్యం. చలికాలంలో చల్లనీళ్లను తాగాలనిపించకపోతే.. గోరువెచ్చని నీటిని తాగండి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. 

45
Image: Getty

Image: Getty

మన శరీరంలో వాటర్ తగినంత లేకపోతే శరీరం బలహీనంగా మారుతుంది. మనం నీళ్లను తక్కువగా తాగితే శరీర పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. అంతేకాక మన శరీరానికి సరైన ఆక్సిజన్ కూడా అందదు. అలసట, డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. అందుకే నీటిని రోజూ పుష్కలంగా తాగాలి. 
 

55
Image: Getty

Image: Getty

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నీళ్లను నిలబడి తాగకూడదు. మారథాన్ రన్నర్లు పరిగెత్తేటప్పుడు నీటిని తాగడం మీరు చూసే ఉండొచ్చు. పరిగెత్తేటప్పుడు నీళ్లు తాగినా స్వేచ్ఛగా తాగుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే నీటిని తాగేటప్పుడు ఉదారంగా తాగాలి. తొందర తొందరగా నీటిని తాగకూడదు. 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved