మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే.. మీ ముఖం ఇలా మారిపోతుంది.. గమనించారా?
మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మన ముఖంపై కూడా ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి మీ ఆరోగ్యం రిస్క్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు.
high cholesterol
కొలెస్ట్రాల్ ను చిన్న సమస్యగా చూడటానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచిదైతే రెండోది చెడుది. ఈ చెడు కొలెస్ట్రాల్ యే మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ఒకప్పుడు బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి సమస్యలను జీవనశైలి వ్యాధులుగా భావించి తేలిగ్గా తీసుకునేవారు. ఇలా వీటిని తేలిగ్గా తీసిపారేస్తేనే ఎన్నో రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు.
cholesterol
జీవన శైలి వ్యాధులైనా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ విషయంలో. మీకు తెలుసా? చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. అందుకే ఈ కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మెరగైన జీవన శైలి, మంచి ఆహారపు అలవాట్లతో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
high cholesterol
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు వీటి లెవెల్స్ ను తరచుగా చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే ఈ కొలెస్ట్రాల్ మరింత పెరిగి మీరు ఎన్నో ప్రాణాంతక సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. మీ శరీరం దాని సంకేతాలను చూపుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు ముఖంపై కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
కనురెప్పలపైన
మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే మీ కనురెప్పలు కూడా కొన్ని సంకేతాలను ఇస్తాయి. దీనివల్ల కనురెప్పల పైన లేదా కింద లేదా కనురెప్పలపై ద్రవంతో నిండిన పసుపు, లేత నారింజ వంటి చిన్న బుడగలు కనిపిస్తాయి. ఇది కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంకేతం. అయితే బుడగలను తాకినా అవి పగిలి పోవు. ఎలాంటి నొప్పి కలగదు. అలాగే మీ కంటి లోపల కార్నియా చుట్టూ లేత తెలుపు కూడా మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి సంకేతం.
ముఖం పై దురద
మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే మీ ముఖ చర్మంపై దురద పెడుతుంది. ఆ తర్వాత మచ్చలు కూడా అవుతాయి. అలాగో నోటి లోపల కూడా ఇలాంటి దురద, మచ్చల వంటి సమస్యలు వస్తాయి. మీకు ఈ సమస్య ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.
High Cholesterol
సోరియాసిస్
సోరియాసిస్ ఒక చర్మ వ్యాధి. సోరియాసిస్ చర్మం పొరల లాగా పొరలుగా మారి దురద పెడుతుంది. చర్మం ఎర్రగా మారుతుంది. సోరియాసిస్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు కూడా గురవుతుంది. ముఖ్యంగా ముఖంపై సోరియాసిస్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా కచ్చితంగా పరీక్షలు చేయించుకోండి.
High Cholesterol
ఇవన్నీ ముఖంపై అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు. వీటితో పాటు హైబీపీ, విపరీతమైన అలసట, మాట్లాడటంలో ఇబ్బంది, మైకము, ఛాతీ నొప్పి, తిమ్మిరి, అకస్మాత్తుగా చలి పెట్టడం వంటి లక్షణాలు కూడా కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి సంకేతాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లాలి. ఆలస్యం చేస్తే ఈ సమస్య గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది.