ఉదయం లేవగానే ఏం చేయాలో తెలుసా?
ఉదయం పూట మనం ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. అలాగే అలసటను దరిచేరనీయవు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇందుకోసం ఉదయాన్నే ఏం చేయాలో ఓ లుక్కేద్దాం పదండి.
సాధారణంగా మనం రోజంతా రిఫ్రెష్ గా ఉండాలంటే రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర మనల్నిరీఫ్రెష్ గా, హెల్తీగా ఉంచుతుంది. నిద్రతో పాటుగా మీరు ఉదయాన్నే ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇవే మనల్ని రోజంగా అలసిపోకుండా ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తాయి. అవేంటో చూసేద్దాం పదండి.
ఒకేసమయానికి నిద్రలేవడం
ఒకే సమయానికి ఎలా అయితే నిద్రపోతామో.. అలాగే ఒకేసమయానికి నిద్రలేవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమశిక్షణ ఖచ్చితంగా మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మెరుగుపరుస్తుంది. ఈ అలవాటు మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.
టీ, కాఫీలు వద్దు
చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి టీ లేదా కాఫీని తాగే అలవాటు ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైన అలవాటు కాదు. ఉదయాన్నే పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా మందిలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
వాటర్
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే గది ఉష్ణోగ్రత వద్ద లేదా గోరు వెచ్చగా ఉన్న ఒక గ్లాసు నీటిని ఖచ్చితంగా తాగండి. టీ, కాఫీలకు బదులుగా మీరు ఒక గ్లాస్ నీటితో మీ రోజును స్టార్ట్ చేయొచ్చు. ఈ అలవాటు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, మీరు ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది.
వ్యాయామం
కరెక్టు సమయానికి నిద్రలేచి నీళ్లను తాగిన కాసేపటికి స్ట్రెచ్ లేదా యోగా చేయడం చాలా మంచి అలవాటు. వాకింగ్, జాగింగ్ వంటివి చేయడం వల్ల మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. అలాగే మీరు ఫిట్ గా కూడా ఉంటారు.
స్నానం
ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. స్నానం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. చల్లటి నీటిలో ఉదయాన్నే స్నానం చేస్తే రోజంతా రిఫ్రెష్ గా ఉంటారు. చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు.
సంగీతం
ఉదయాన్నే కాసేపు సంగీతాన్ని ఆస్వాదించడం కూడా మంచి అలవాటు. ఇది మన మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది మనస్సుకు మంచి మేల్కొలుపును ఇస్తుంది. అలాగే శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.