MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: నరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఆహారం తప్పనిసరి?

Health Tips: నరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఆహారం తప్పనిసరి?

Health Tips: నేటి ఉరుకుల పరుగుల ప్రయాణంలో అనేక అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో ఒకటి నరాల నొప్పి. అయితే ఈ నరాల నొప్పిని ఈ ఆహారం తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచొచ్చు. అది ఎలాగో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 14 2023, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేటి యువత చాలా మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలు గాని వ్యాపారాలు గాని చేస్తున్నారు. దీనివలన మెదడుపై విపరీతమైన భారం పడటంతో తీవ్రమైన నరాలు నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి లేకపోవడం, వ్యాయామం లేకపోవడం..
 

26

పౌష్టికాహారం తీసుకోకపోవడంతో నరాల సమస్యలు ఇప్పుడు జనాలను విపరీతంగా బాధిస్తున్నాయి. సహజంగా నరాల నొప్పి మధుమేహం ఉన్న వారిలో, మందులు ఎక్కువగా వాడుతున్న వారిలో లేదా కీమోథెరపీ  చేయించుకుంటున్న వారిలో ఎక్కువగా ఈ నొప్పి ఉంటుంది.
 

36

అలాగే మెదడు మరియు వెన్నుపాము సమస్య ఉన్నప్పుడు కూడా నరాల నొప్పి విపరీతంగా బాధిస్తుంది. అలాగే విటమిన్ బి1, బి12 లోపం ఏర్పడినప్పుడు, నరాలకు రక్తం సరఫరా తగ్గినప్పుడు నరాలు సహజంగా నొప్పికి గురవుతాయి. ఈ బాధ భరించలేనిదిగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం.
 

46

అలా కాకుండా నొప్పి చిన్నగా ఉండేటట్లయితే సరియైన ఆహారం తీసుకోవడం ద్వారా నొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పసుపుని చేర్చుకోవటం రాత్రి సమయంలో పడుకునే ముందు ఒక గ్లాసు వేడిపాలలో పసుపు కొంచెం..
 

56

మిరియాల పొడి కలుపుకొని తీసుకోవటం వల్ల నరాల నొప్పి తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు వల్ల నరాల నొప్పి తగ్గుతుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి అందులో ఒక స్పూన్ తేనె కలిపి వారంలో రెండు సార్లు తాగితే నరాలు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
 

66

దాంతో పాటు మెగ్నీషియం అధికంగా ఉండే వాల్నట్స్, పుచ్చకాయ, బచ్చల కూర, అరటిపండు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా మీ డైట్ లో చేర్చుకోండి. దీనికి తోడు సరియైన వ్యాయామం చేస్తే నరాల నొప్పిని అదుపులో ఉంచవచ్చు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Papaya Benefits: రోజూ బొప్పాయి తింటే చాలు.. ఈ జబ్బులన్నీ పరార్!
Recommended image2
Green Tea: రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?
Recommended image3
Gas Relief Tips: ఈ ఒక్క డ్రింక్‍తో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య దూరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved