MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • కూరగాయలను రోజూ తింటే ఇన్ని రోగాలు రావా?

కూరగాయలను రోజూ తింటే ఇన్ని రోగాలు రావా?

కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శాఖాహార ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 13 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
vegetarian diet

vegetarian diet

శాకాహారం మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అంతేకాదు ఎన్నో రోగాల ముప్పును కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి, కూరగాయలకు మధ్య సంబంధం చాలా గొప్పది. కూరగాయల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తింటే ఎన్నో లాభాలను పొందుతారు. శాఖాహారం శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్ గా కూరగాయలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కూరగాయలలో సాధారణంగా సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ కు దారితీస్తుంది. 
 

38

అధిక రక్తపోటు

పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండే కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటు కూడా గుండెపోటుకు దారితీస్తుంది.
 

48
vegetarian diet

vegetarian diet

గుండె  ఆరోగ్యం

కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

58

డయాబెటీస్ 

శాఖాహారం తినేవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా కూరగాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

68
food

food

క్యాన్సర్

శాఖాహార ఆహారాన్ని అనుసరించేవారికి పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్యాన్సర్ లకు దూరంగా ఉంచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే కూరగాయలను తినొచ్చు. 
 

78

జీర్ణక్రియ 

ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 
 

88

వెయిట్ లాస్

కూరగాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. తొందరగా కడుపును నింపుతుంది. తద్వారా మీరు తొందరగా బరువు తగ్గుతారు.

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved