పప్పును ఎక్కువగా తింటున్నారా? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి ఇలా అస్సలు తినరు
పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగని ఎప్పుడూ వీటినే తినడం ఆరోగ్యనికి అస్సలు మంచిది కాదు. అవును పప్పులను మరీ ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
మాంసాహారంలోనే కాదు పప్పుల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే శాకాహారులు ప్రోటీన్ ను పొందడానికి పప్పులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది పప్పును రోజూ తింటుంటారు. టమాటా పప్పు, సాంబర్ అంటూ ఏదో ఒక రూపంలో పప్పులను వారంలో నాలుగైదు రోజులైనా తింటుంటారు. నిజానికి పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి.
పప్పును తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. కానీ అతి ఏదీ మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది పప్పు కు కూడా వర్తిస్తుంది. అవును పప్పును అతిగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కడుపు ఉబ్బరం, గ్యాస్
పప్పు కూరను ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పప్పులో డైటీర ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే ఇది అరగడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు తిమ్మిరి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
పోషకాహార లోపం
పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే మాత్రం పోషక లోపం సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పుల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే ఇది మన శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే పప్పుల్లో ఉండే ఫైటేట్లు కాల్షియం, జింక్, ఇనుము వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
Image: Freepik
బరువు పెరగొచ్చు
బరువు తగ్గాలనుకుంటున్న వారు కూడా పప్పును ఎక్కువగా తింటారు. ఎందుకంటే దీనిలోని ప్రోటీన్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కానీ పప్పుల్లో ఉండే కేలరీలు, కార్భోహైడ్రేట్లు మీ బరువును పెంచుతాయి. అందుకే పప్పును ఎక్కువగా తినకూడదు.
dal
మూత్రపిండాల్లో రాళ్లు
పప్పులను ఎక్కువగా తింటే మీ మూత్రపిండాల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పప్పుల్లో ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పప్పును ఎక్కువగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. పప్పును ఎక్కువగా తింటే పిత్తాశయం పై కూడా చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.