MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మీకు డయాబెటిస్, హై బీపీ సమస్యలున్నాయా? అయితే చలికాలంలో జర జాగ్రత్త..

మీకు డయాబెటిస్, హై బీపీ సమస్యలున్నాయా? అయితే చలికాలంలో జర జాగ్రత్త..

అధిక రక్తపోటు, డయాబెటిస్ లేదా మరేదైనా వ్యాధితో బాధపడుతున్నట్టైతే మీరు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. అవును ఇతర సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లోనే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా పెరుగుతాయి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 04 2023, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు బాగా పెరుగుతాయి. నిజానికి వాతావరణంలో మార్పుల వల్ల వృద్ధులతో పాటుగా యువకుల్లో కూడా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీంతో బీపీ పెరిగి శరీరంలోని కండరాలు కూడా సరిగా పనిచేయవు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతానికి దారితీస్తుంది. అందులోనూ చలికాలంలో చాలా మంది ఇతర సీజన్ల కంటే నీళ్లను చాలా తక్కువగా తాగుతారు. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మీ రక్తం మందంగా మారుతుంది. ఇది హైబీపీ, డయాబెటిస్ పేషెంట్లకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది.
 

24

బ్రెయిన్ స్ట్రోక్ రకాలు 

బ్రెయిన్ స్ట్రోక్ లో రెండు రకాలు ఉన్నాయి. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఇస్కీమిక్ స్ట్రోక్ కు కారణమవుతుంది. అలాగే మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ హెమరేజ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో ఈ చలికాలంలో మీరు ఇప్పటికే ఈ వ్యాధులతో బాధపడుతున్నట్టైతే ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న అజాగ్రత్త కూడా మీ జీవితాన్ని ఎంతో దెబ్బతీస్తుంది. 
 

34
stroke symptoms

stroke symptoms

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు

చేతులు, కాళ్ల కదలికలో ఇబ్బంది

 ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గడం

సరిగా మాట్లాడలేకపోవడం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

తలనొప్పి, వాంతులు

44

వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

- మీరు ఉదయం లేవగానే ఖచ్చితగా కాసేపు వ్యాయామం చేయండి. ఒకవేళ మీ చుట్టుపక్కల కాలుష్యం ఉంటే ఆరుబయట కాకుండా ఇంట్లోనే వ్యాయామం చేయంది. 

- మీకు రక్తపోటు ఎక్కువగా ఉంటే ఉదయం నడక మానుకోండి.

- బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులను ధరించండి. సాక్స్ నుంచి గ్లౌజులు, టోపీల వరకు శరీరాన్ని బాగా కప్పి ఉంచాలి.

- మీరు తినే ఆహారం, జీవనశైలిలో అవసరమైన మార్పులు చేస్తే మీ రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటుంది. 

- ఎక్కువగా వేయించిన, జంక్, మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి.

- డయాబెటీస్ ను, అధిక రక్తపోటును రెగ్యులర్ గా చెక్ చేయండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Orange Benefits: రోజుకో ఆరెంజ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image3
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved