MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • అసలు గురక ఎందుకు వస్తుందో తెలుసా?

అసలు గురక ఎందుకు వస్తుందో తెలుసా?

గురక వల్ల నిద్ర డిస్టబెన్స్ అవుతుందనే చూస్తారు కానీ.. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఏదైనా సమస్య ఉందా? అని ఎవరూ ఆలోచించరు. నిజానికి గురక రావడం మంచిది కాదు. ఇది మీకు అనారోగ్య సమస్యలు ఉండటాన్ని చూపిస్తుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 21 2024, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
snoring

snoring

ఈ రోజుల్లో చాలా మంది గురక పెడుతున్నారు. ఆడవాళ్లు మగవారు అంటూ తేడా లేకుండా గురక పెడుతుంటారు. ఈ గురక వల్ల పక్కన పడుకున్న వారికి నిద్రే ఉండదు. ఇంకేముంది గురక పెట్టేవారిని తిట్టుకుంటుంటారు. కానీ గురక లైట్ తీసుకోవాల్సిన చిన్న సమస్య అయితే కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నిజానికి గురక పెట్టేవారికి వారు గురక పెడుతున్నట్టుగా కూడా తెలియదు. చాలా మంది గాఢనిద్రలోకి వెళ్లిన వెంటనే గురక పెట్టడం మొదలుపెడతారు. అంటే ఇది గాఢంగా నిద్రపోవడం వల్లే వచ్చే సమస్య కాదు. ఇది మీకు ప్రమాదకరమైన సమస్య ఉండటాన్ని సూచిస్తుంది.

ఎవ్వరైనా సరే గట్టి గట్టిగా గురక పెడుతుంటే నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని చాలా ప్రభావితం చేసే స్లీప్ అప్నియా వంటి  సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. గురక పెడుతున్నట్టైతే వెంటనే రెండు రకాల టెస్టులు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

34

గట్టి గట్టిగా గురక పెట్టేవారు ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ ను సంప్రదించాలి. అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా టెస్ట్ ను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియా అంటే నిద్రపోతున్నప్పుడు సడెన్ గా శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీనివల్ల మీ శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో మీరు గురక పెడతారు.

అయితే ఈ టెస్ట లో మీ మెదడు తరంగాలు, శ్వాస రేటు, ఆక్సిజన్ లెవెల్, హృదయ స్పందన రేటు వంటి మీ శరీరం వివిధ సంకేతాలను పర్యవేక్షిస్తారు. ఈ టెస్ట్ మీకు స్లీప్ అప్నియా సమస్య ఉందో లేదో చెప్తుంది. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

44

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గురక రావడానికి థైరాయిడ్ కూడా ఒక కారణం కావొచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటే గట్టి గట్టిగా గురక పెడతారు. థైరాయిడ్ సమస్య పెరిగితే స్లీప్ అప్నియా సమస్య కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం వల్ల థైరాయిడ్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు ఊబకాయం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image3
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved