పుచ్చకాయ తిని గింజలను పారేస్తున్నారా.. మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా?
ఎండాకాలంలో పుచ్చకాయలకు కొదవే ఉండదు. ఈ పండును తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతబానే ఉంది కానీ.. ఈ పండు గుజ్జును తిని గింజలను పారేస్తుంటారు చాలా మంది. దీనివల్ల మీరెన్ని లాభాలను మిస్ అవుతున్నారో తెలుసా?

ఎండాకాలం అనగానే పుచ్చకాయలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఈ పండు ఈ సీజన్ లోనే పండుతుంది. ఈ సీజన్ లో ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మనలో చాలా మంది పుచ్చకాయ గుజ్జును తిని గింజలను పక్కన పెట్టేస్తుంటారు. కానీ పుచ్చకాయ గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాల మాదిరిగానే పుచ్చకాయ విత్తనాలను ఎంచక్కా తినొచ్చు. అసలు ఈ గింజలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యం
పుచ్చకాయ విత్తనాలు మెగ్నీషియానికి అద్భుతమైన మూలం. ఈ పండును తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరును మెరుగుపర్చడానికి పుచ్చకాయ ఎంతగానో సహాయపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థకు మద్దతు
రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే ఎలాంటి రోగాలు రావు. రోగనిరోధక శక్తి బాగుండాలంటే జింక్ చాలా అవసరం. ఈ పోషకం పుచ్చకాయ విత్తనాలలో సమృద్ధిగా ఉంటుంది. అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడటానికి సహాయపడే రోగనిరోధక కణాలు జింక్ సహాయంతో ఉత్పత్తి అవుతాయి. అలాగే సక్రమంగా పనిచేస్తాయి.
జీర్ణ ఆరోగ్యం
పుచ్చకాయ విత్తనాలలో ఫైబర్, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి.
ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు
పుచ్చకాయ ఫేస్ మాస్క్ లు కూడా ఉపయోగించొచ్చు. పుచ్చకాయ విత్తనాలలో ప్రోటీన్, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఈ పోషకాలు మంటను తగ్గించడానికి, మొటిమలను నివారించడానికి కూడా సహాయపడతాయి.
seed
ఎముక ఆరోగ్యం
పుచ్చకాయ గింజలు ఎముకలను బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. పుచ్చకాయల గింజల్లో మన ఎముకలను బలంగా ఉంచే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముక ఆరోగ్యంతో పాటుగా కండరాల పనితీరును, సరైన నరాల పనితీరుకు ఇది చాలా అవసరం.
melon
పుచ్చకాయ విత్తనాలను ఎలా తినాలి?
పుచ్చకాయ విత్తనాలను ఓవెన్ ఉడికించి తినొచ్చు. పుచ్చకాయ విత్తనాలకు బేకింగ్ తర్వాత ఉప్పు లేదా ఇతర మసాలా దినుసులను జోడించి తినొచ్చు.
పుచ్చకాయ విత్తనాలను ఎంత తినాలి
పుచ్చకాయ విత్తనాలను క్రమం తప్పకుండా తినొచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ వీటిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినకండి. వీటిని మితంగానే తినాలి. రోజుకు 30 గ్రాములు లేదా ఒక కప్పు పుచ్చకాయ విత్తనాలలో మూడింట ఒక వంతును మాత్రమే తినండి. కాల్చిన లేదా మొలకెత్తిన పుచ్చకాయ విత్తనాలు ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే ఇవి జీర్ణం కావడం చాలా సులువు. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.