- Home
- Life
- Health
- Health Tips: ఎలర్జీలు, గొంతు నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ సర్వరోగ నివారిణి ట్రై చేయండి?
Health Tips: ఎలర్జీలు, గొంతు నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ సర్వరోగ నివారిణి ట్రై చేయండి?
Health Tips: మనం ఇంట్లో రైస్ వాటర్ ని చాలా ఈజీగా వేస్ట్ చేసేస్తాం కానీ అందులో ఉండే దివ్య ఔషధాలు గురించి తెలుసుకుంటే ఇకపై మీరు ఆ తప్పు చేయరు. ఇది సర్వరోగాలని నివారిస్తుంది. దీని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బియ్యం కడిగి లేదా ఉడకబెట్టడం ద్వారా వచ్చే ప్రభావంతమైన ద్రవం రైస్ వాటర్. దీనిని అందం కోసం,ఆరోగ్యం కోసం కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. ఇది మీ చర్మానికి మంచి టోనర్ లాగా పనిచేస్తుంది. అలాగే జుట్టుకి పట్టించడం వల్ల కుదుళ్ళు బలపడతాయి. రైస్ వాటర్ యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంటుంది.
అందువల్ల సూర్యరస్మి కి గురైనప్పుడు చర్మం రేడియేషన్ కి గురికాకుండా కాపాడుతుంది. గోరువెచ్చని బియ్యం నీటితో పుక్కిలించడం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే తేలికపాటి గంజి కంటెంట్ గొంతుని పూయటానికి సహాయపడుతుంది.
కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నప్పుడు చల్లబడిన మరియు వడకట్టిన బియ్యం నీటిని కంటి కంప్రెస్సుగా ఉపయోగించటం వల్ల కంటి ఎరుపు, కంటి వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అలసిపోయిన కళ్ళకి ఓదార్పులుస్తుంది.
రైస్ వాటర్ ని ఫేస్ మాస్క్ గా అప్లై చేయడం వల్ల చర్మం ఆకృతిని మెరుగుపరచడంలోనూ మరియు చర్మాన్ని కాంతివంతంగా కనిపించడంలోనూ సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల బగ్ కాటు వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించగలవు.
ప్రభావిత ప్రాంతానికి బియ్యం నీటిని అప్లై చేయడం వల్ల వాపు మరియు దురద తగ్గుతుంది. అలాగే రైస్ వాటర్ లో ఉండే ప్రోటీన్లు జుట్టు పగుళ్ళని తగ్గించి చిగుళ్ళని గట్టి పడేలాగా చేస్తుంది. జుట్టుని షాంపూ చేసుకున్న తర్వాత రైస్ వాటర్ తో జుట్టుని కడుక్కోవడం వలన మంచి షైనింగ్ వస్తుంది.
అంతేకాకుండా నెత్తి మీద పొడి లేదా దురద ఉన్నవారికి ఇది మంచి దివ్య ఔషధం. అలాగే రైస్ వాటర్ అజీర్ణానికి, డయేరియా లక్షణాలని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. బియ్యం నీటిలో ఉండే పొటాషియం సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరం కోల్పోయిన ద్రవ్యాలని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది కాబట్టి దీనిని ఈరోజు వారి దినచర్యలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.