ఈ రంగు కూరగాయలను తప్పకుండా తినండి.. ఎన్నో రోగాలు తగ్గిపోతాయి
పర్పుల్ కలర్ లో ఉండే కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రంగు కూరగాయలను తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పర్పుల్ కలర్ కూరగాయలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. పర్పుల్ క్యాబేజీ, బీట్ రూట్, వంకాయ వంటి ఎన్నో కూరగాయలు ఊదా రంగులో ఉంటాయి. మీకు తెలుసా వీటిలో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. అసలు పర్పుల్ కలర్ కూరగాయలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
purple cabbage
పర్పుల్ క్యాబేజీ
పర్పుల్ కలర్ లో ఉండే క్యాబేజీ లేదా రెడ్ కలర్ లో ఉండే క్యాబేజీ 'బ్రాసికాసీ' కుటుంబానికి చెందినది. ఒక కప్పు అంటే 89 గ్రాముల పర్పుల్ కలర్ క్యాబేజీలో 28 కేలరీలు మాత్రమే ఉంటాయి. అందుకే ఇది బరువును తగ్గించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. 7 గ్రాముల పర్పుల్ క్యాబేజీలో 2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాముల డైటరీ ఫైబర్స్, 89 గ్రాముల ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి.
purple cabbage
విటమిన్ ఎ పుష్కలంగా ఉండే పర్పుల్ కలర్ క్యాబేజీ కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇవి కంటిచూపును మెరుగుపర్చడంతో పాటుగా కంటిశుక్లం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. పర్పుల్ కలర్ క్యాబేజీలోని పోషకాలు వయసు పెరిగినా కూడా కళ్లను మాత్రం ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలోని విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
purple cabbage
పర్పుల్ క్యాబేజీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుంది. విటమిన్ల భాండాగారమైన పర్పుల్ కలర్ క్యాబేజీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ క్యాబేజీలో మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ తో పాటుగా ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
purple cabbage
పర్పుల్ కలర్ క్యాబేజీ కూడా అల్సర్లను నివారించడానికి సహాయపడుతుంది. పర్పుల్ కలర్ క్యాబేజీలో గ్లూటామైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది కడుపు పూతల వల్ల కలిగే మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండే పర్పుల్ కలర్ క్యాబేజీ అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది.
beetroot
బీటు రూట్
బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాల గని. బీట్ రూట్ లో విటమిన్ సి, విటమన్ ఎ, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లో కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు దీనిని ఎంచక్కా తినొచ్చు. బీట్ రూట్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేయడానికి సహాయపడుతుంది.
బీట్ రూట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఇది శరీర బరువును నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో పొటాషియం కూడా మెండుగా ఉంటుంది. బీట్ రూట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇవి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి బీట్ రూట్ ను రోజూ తినండి.
Image: Getty
బీట్ రూట్ ను తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బీట్ రూట్ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బీట్ రూట్ ఇనుము కు మంచి వనరు. కాబట్టి రక్తహీనత ఉన్నవారు బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే ఒంట్లో రక్తం పెరుగుతుంది.
వంకాయ
వంకాయలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పర్పుల్ కలర్ వంకాయలో ఫ్లేవనాయిడ్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే పొటాషియం, సోడియం, కాల్షియం, జింక్, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, ఫోలేట్, విటమిన్ బి 6, విటమిన్ సి కూడా దీనిలో ఎక్కువగా ఉంటాయి.
వంకాయను తినడం వల్ల మీ గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. పొటాషియం, విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్న వంకాయ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ధమనులను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండే వంకాయను తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ వంకాయ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. వంకాయలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ గా పనిచేసి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మధుమేహులు ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఆహారం నుంచి గ్లూకోజ్ శోషణను నియంత్రించి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.