MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఒక్క నెల రోజుల పాటు చక్కెరను మానేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా?

ఒక్క నెల రోజుల పాటు చక్కెరను మానేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా?

చక్కెరతో చేసిన స్వీట్స్ బలే టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని ఇష్టంగా, ప్రతిరోజూ తినేవారున్నారు. నిజానికి చక్కెరతో చేసిన ఆహారాలు టేస్టీగా ఉన్నా.. ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఈ చక్కెరను ఒక్క నెల రోజుల పాటు తీసుకోవడం మానేస్తే ఎన్ని అద్బుతాలు జరుగుతాయో తెలుసా? 

R Shivallela | Updated : Oct 25 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

పంచదారతో చేసిన ఆహారాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం మనం తాగే టీ నుంచి మొదలుకుంటే ఎన్నో రకాల ఆహారాల్లో ప్రతిరోజూ తింటూ ఉంటాం. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే దీన్ని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అయితే చక్కెరను తీసుకోవడం మానేయాలనుకుంటే డాక్టర్ సలహా మేరకే ఈ పని చేయాలని నిపుణులు చెబుతున్నారు. 30 రోజుల పాటు చక్కెర తీసుకోకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
 

26
Asianet Image

బ్లడ్ షుగర్

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే ఒక నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలా మీరు డయాబెటీస్ ను నియంత్రించొచ్చు. అయితే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే చక్కెరను పూర్తిగా మానేయాలి. 
 

36
Asianet Image

బరువు

చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక్క ముప్పై రోజుల పాటు మీరు చక్కెరను మానేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. 

దంతాల ఆరోగ్యం

చక్కెర దంతాల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఒక్క నెల రోజుల పాటు మీ ఆహారం నుంచి చక్కెరను తొలగిస్తే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాల సమస్యలొచ్చే ప్రమాదం కూడా తప్పుతుంది.
 

46
Asianet Image

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం

నెల రోజుల పాటు చక్కెరను తీసుకోకపోవడం మానేస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు కడుపులో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. 

కాలెయ ఆరోగ్యం

మీ ఆహారం నుంచి పూర్తిగా ఒక నెలరోజుల పాటు దూరం చేస్తే మీ కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలెయ పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

ఎనర్జీ లెవెల్స్: చక్కెరకు నెల రోజుల పాటు  దూరంగా ఉంటే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

56
Asianet Image

గుండె ఆరోగ్యం: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఒక్క నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

క్యాన్సర్ల ముప్పు: చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు  వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఒక నెల రోజుల పాటు చక్కెరను నివారించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

66
Asianet Image

చర్మ ఆరోగ్యం: చక్కెర చర్మ ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. అయితే నెల రోజుల పాటు చక్కెరను తీసుకోవడం మానేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 

మానసిక ఆరోగ్యం: చక్కెర వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది.

R Shivallela
About the Author
R Shivallela
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories