పుదీనా ఆకులను ఇందుకే తినాలంటరు..
పుదీనా ఆకులు కమ్మని వాసన రావడమే కాదు.. దీనిలో ఎణ్నో ఔషద గుణాలు దాగున్నాయి. ఈ ఆకులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం..

<p>mint leaves</p>
మనం తినే ఆహారం పట్ల కాస్త శ్రద్ధగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆహారం ద్వారా మనకు అవసరమైన ఎన్నో పదార్థాలు లభిస్తాయి. ఇవన్నీ మన శరీరంలోని వివిధ విధులకు ఉపయోగపడతాయి. మన శరీరంలో ఏ పోషకాలు, ఖనిజాలు లోపించినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
<p>mint leaves</p>
అయితే సాంప్రదాయకంగా ఔషధంగా పరిగణించబడుతున్న పుదీనా ఆకుల కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకుల టీ, జ్యూస్, సలాడ్స్ ఇలా ఎన్నో వంటకాల్లో పుదీనా ఆకులను కలుపుతారు. అసలు పుదీనా ఆకులను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి నుంచి ఉపశమనం
మానసిక ఒత్తిడిని ఎదుర్కోని వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. ఈ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే పుదీనా ఆకులు ఈ ఒత్తిడిని తగ్గించడానికి, ఒత్తిళ్లకు దూరంగా ఉండటానికి సహాయపడతాయి. పుదీనా రక్తంలో కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. కార్టిసాల్ అనే హార్మోన్ మనల్ని ఒత్తిడికి గురిచేస్తుంది.
mint leaves
చర్మం కోసం
పుదీనా ఆకులు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. పుదీనా ఆకులు చర్మంలో ప్రతిచోటా రక్త ప్రవాహానికి సహాయపడతాయి. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పుదీనా ఆకులు చర్మ కణాల నాశనాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయి. చర్మంపై ముడతలు, మచ్చలు లేదా గీతలను నివారిస్తాయి.
జీర్ణక్రియ కోసం
పుదీనా ఆకులు జీర్ణ సమస్యలను తొలగించడానికి, జీర్ణక్రియను పెంచడానికి కూడా చాలా సహాయపడతాయి. పుదీనా ఆకులు పిత్త ప్రవాహాన్ని పెంచి జీర్ణక్రియను పెంచడంలో సహాయపడతాయి. అలాగే పుదీనా ఆకులు కూడా ఆహారాల నుంచి అవసరమైన పోషకాలను పొందడానికి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇవి జీర్ణ క్రియను పెంచుతాయి. దీంతో కేలరీలు కరుగుతాయి.
mint leaves
కఫం కోసం
కఫం సమస్యతో బాధపడేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్లో ఉండే 'మెంతోల్' ఈ శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేసి సాఫీగా బయటకు రావడానికి సహాయపడుతుంది.
బీపీ కోసం
పుదీనా ఆకులు కూడా అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. పుదీనాలో ఉండే 'మెంతోల్' దీనికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.