జస్ట్ ఒక టీస్పూన్ అల్లం రసం తాగితే ఈ రోగాలన్నీ తగ్గిపోతాయి తెలుసా?
సీజన్ మారుతుంటే దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో రోజూ ఒక టీస్పూన్ అల్లం రసం తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అల్లంలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా మారుతున్న ఈ సీజన్ లో అల్లం ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. అలాగే ఈ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొన్నేండ్ల నుంచి మన తాతలు, ముత్తాతలు దీన్ని ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. అందుకే వీళ్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటుంది. అసలు అల్లం రసం తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ginger water
జీర్ణక్రియకు సహాయపడుతుంది
అల్లం రసం వాంతులు, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. అలాగే ఇది డయేరియాను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు లేదా తర్వాత ఉప్పు, నిమ్మరసం కలిపిన అల్లం రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. అల్లంలో ఉండే కొన్ని ముఖ్యమైన భాగాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.
అధిక రక్తపోటు
అల్లం రసం 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఉన్నవారికి వచ్చిన అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది రక్తంలో ప్లేట్లెట్స్ కలిసి ఉండకుండా నిరోధిస్తుంది. ఇది రక్తం పల్చగా ఉండటానికి సహాయపడుతుంది. శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఇది ప్రమాదకరం.
పెయిన్ కిల్లర్ లాగా
తాజా అల్లం రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం ఒక గిన్నెలో ఒక టీస్పూన్ అల్లం రసంలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి నొప్పి ఉన్న చోట మసాజ్ చేయాలి. మంచి ఫలితాల కోసం రాత్రంతా అలాగేవదిలేయండి, ఉదయం కల్లా మీకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అంతేకాదు ఇది పంటినొప్పి, మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. పంటి నొప్పి ఉంటే మీ బుగ్గలు, దంతాల మధ్య చిన్న అల్లం ముక్కను ఉంచండి. దీని రసం సమస్య నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే మైగ్రేన్ తగ్గుతుంది.
నోటి దుర్వాసన
నోటిదుర్వాసనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏదేమైనా ఇది నలుగురిలో ఇబ్బందిని కలిగిస్తుంది. మీకు కూడా ఈ సమస్య ఉన్నట్టైతే అల్లం రసాన్ని తాగండి. ఎందుకంటే అల్లం రసంలో ఉండే విటమిన్ సి నోటి లోపల దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఒక టీస్పూన్ అల్లం రసంలో కొద్దిగా నిమ్మరసం, నీటిని మిక్స్ చేయండి. ఇప్పుడు దానితో కొన్ని నిమిషాలు పుక్కిలించండి.
ఆరోగ్యకరమైన జుట్టు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. అల్లం రసం నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే అల్లం రసంలోని యాంటీసెప్టిక్ లక్షణాలు చుండ్రును కూడా పోగొడుతాయి, జుట్టు పొడిబారితే అల్లం రసాన్ని ఆలివ్ ఆయిల్ తో కలిపి మసాజ్ చేయండి. అలాగే దీన్ని రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా, దట్టంగా తయారవుతుంది.