MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా ఈ ఆకులను తినండి.. ఏ రోగమూ రాదు

ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా ఈ ఆకులను తినండి.. ఏ రోగమూ రాదు

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన వాటిని ఖచ్చితంగా తినాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన వాటిలో కొన్ని ఆకులు కూడా ఉన్నాయి. వీటిని గనుక ఉదయం టీ, కాఫీలకు బదులుగా పరిగడుపున తిన్నారంటే మీకు ఏ రోగమూ రాదంటున్నారో కొందరు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ అవి ఏ ఆకులంటే? 
 

Shivaleela Rajamoni | Updated : Nov 18 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

మనలో చాలా మంది లేచిన వెంటనే వేడి టీనో లేకపోతే కాఫీనో తాగుతుంటారు. టీ, కాఫీలు తాగనిదే ఏ పనీ తోచదు మరి. ఇవి మూడ్ ను రిఫ్రెష్ చేస్తాయి. నిద్ర మత్తును వదిలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే?  చాలా మందికి టీ, కాఫీలు తాగిన తర్వాతే కడుపు క్లియర్ అవుతుంది. ఏదేమైనా.. పరిగడుపున ఈ టీ, కాఫీలను తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిని పరగడుపున తాగడం వల్ల రోజంతా గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తారు. దీనివల్ల మీకు ఇంకేం తినాలనిపించదు. దీంతో మీకు బలహీనంగా అనిపిస్తుంది. మరి టీ, కాఫీలకు బదులుగా ఎలాంటి ఆకులను తింటే మంచిదో తెలుసుకుందాం పదండి. 

26
Asianet Image

వేప ఆకులు

వేప ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను పరిగడుపున తింటే రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. రక్తం శుభ్రపడుతుంది. దీని వల్ల మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యం కూడా  మెరుగుపడుతుంది. 
 

36
curry leaves

curry leaves

కరివేపాకు

కరివేపాకుకు కూరల్లో ఎక్కువగా వేస్తుంటారు. ఎందుకంటే ఇది వంటలను టేస్టీగా చేస్తుంది. కానీ వీటిని తినేవారు చాలా తక్కువే. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులు అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
 

46
Asianet Image

తులసి ఆకులు

తులసి ఆకులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వీటిని ఎన్నో ఏండ్లుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులను ఉదయం పరగడుపున నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులకు దూరంగా ఉంటారు. ఈ ఆకులు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. 
 

56
Asianet Image

సెలెరీ ఆకులు

సెలెరీ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఎన్నో రకాల ఎంజైములు ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. 

66
Asianet Image

ఎవర్ గ్రీన్ ఆకులు

ఎవర్ గ్రీన్ ఆకులు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ ఆకులు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని దూరం చేయడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలండి. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories