కిస్ మిస్ లను తినకపోతే.. మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే
ఎండుద్రాక్షలు పోషకాల బాంఢాగారం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు, జీర్ణక్రియకు మంచి మేలు చేస్తాయి. వీటిని తింటే ఎన్నో రోగాల ముప్పు కూడా తగ్గుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎండుద్రాక్షలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఎండుద్రాక్షల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అసలు కిస్ మిస్ లను తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం
ఎండుద్రాక్షలో పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఈ శక్తివంతమైన సమ్మేళనాలు సెల్యులార్ నష్టం, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
raisins
జీర్ణ ఆరోగ్యం
ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే కరిగే, కరగని ఫైబర్స్ మలాన్ని సులువుగా బయటకు పంపుతాయి. అలాగే ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. అలాగే జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. రోజూ గుప్పెడు ఎండుద్రాక్షలను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
గుండె ఆరోగ్యం
ఎండు ద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ గుండె పదిలంగా ఉంటుంది. గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. కిస్ మిస్ లల్లో సోడియం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఎండుద్రాక్ష పొటాషియానికి మంచి మూలం. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వీటిలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇనుము స్థాయిలను పెంచుతుంది
ఎండుద్రాక్షలు ఇనుముకు సహజ మూలం. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ను తీసుకువెళ్ళడానికి, సరైన పనితీరుకు, అలసట, బలహీనతను నివారించడానికి ఇనుము చాలా చాలా అవసరం. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత లోపం పోతుంది.
black raisins
ఎముకల ఆరోగ్యం
కిస్ మిస్ లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. ఎండుద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముక సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎండుద్రాక్షలో ఎక్కువ మొత్తంలో ఉండే బోరాన్ కాల్షియం, మెగ్నీషియం శోషణకు సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి
ఎండుద్రాక్షల్లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, ఎండుద్రాక్షలోని ఫైబర్ కంటెంట్ మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అలాగే మీరు అతిగా తినకుండా కాపాడుతుంది. ఎండుద్రాక్షను సమతుల్య ఆహారంలో చేర్చడం వల్ల మీ బరువు కంట్రోల్ లో ఉంటుంది. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది
ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ తో సహా సహజ చక్కెరలు ఉంటాయి. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి వివిధ శారీరక విధులకు సహాయపడతాయి. వ్యాయామం చేసేటప్పుడు మీకు ఎనర్జీ ని అందిస్తాయి.