ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన సెనగలను తింటే ఏం జరుగుతుందో తెలుసా!
సెనగలలో (Senagalu) మన శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి రోజూ ఉదయాన్నే మొలకెత్తిన సెనగలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Senagalu
సెనగలు మంచి పౌష్టికాహారం. ఇందులో ప్రోటీన్స్ తో పాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ వంటి వివిధ ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega 3 fatty acids) కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి కలుగచేసే ప్రయోజనాలు బోలెడు.
Senagalu
ఎముకలను దృఢంగా ఉంచుతాయి: సెనగలలో క్యాల్షియం (Calcium) సమృద్ధిగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలను ధృడంగా (Strengthen the bones) ఉంచుతాయి. చిన్నపిల్లలు, వయసు పైబడిన వారిలో ఎముకలు పెళుసుగా మారే సమస్యలను తగ్గించడానికి కూడ సెనగలు సమర్థవంతంగా సహాయపడతాయి.
Senagalu
బరువు తగ్గుతారు: సెనగలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తిని కలిగి ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ప్రోలేట్లు (Prolates) శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) ను కూడా తగ్గిస్తాయి. కనుక బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో సెనగలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Senagalu
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: సెనగలలో పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని జీర్ణ వ్యవస్థను (Digestive system) మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గించడంతో పాటు అజీర్తి, ఆహారం సరిగ్గా అరుగుదల లేకపోవడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
Senagalu
గుండె ఆరోగ్యంగా ఉంటుంది: సెనగలను నిత్యం తీసుకుంటే గుండెకు రక్త సరఫరా (Blood supply) సక్రమంగా జరుగుతుంది. అలాగే గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. సెనగలలో ఉండే పోషకాలు, అమైనో యాసిడ్స్ ప్రభావాన్ని తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా (Heart health) ఉంటుంది.
Senagalu
రోగనిరోధక శక్తిని పెంచుతాయి: సెనగలలో ఉండే మెగ్నీషియం, మాంగనీస్ (Manganese) శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి సహాయపడుతాయి. దీంతో శరీర రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. కనుక ప్రతి రోజూ క్రమం తప్పకుండా సెనగలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
Senagalu
రక్తహీనత సమస్యలు తగ్గుతాయి: చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్యలలో రక్తహీనత సమస్య (Anemia problem) ఒకటి. సెనగలలో ఇనుము శాతం (Percentage of iron) అధికంగా ఉంటుంది. కనుక ప్రతి రోజూ వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత సమస్యలు తగ్గుతాయి.
Senagalu
మధుమేహాన్ని నివారిస్తాయి: సెనగలలో ఉండే పోషకాలు మధుమేహాన్ని (Diabetes) అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను (Glucose levels) అదుపులో ఉంచుతాయి. దీంతో మధుమేహాన్ని నివారిస్తాయి. కనుక మధుమేహగ్రస్తులకు మొలకెత్తిన సెనగలు ఎంతో మేలు చేస్తాయి.
Senagalu
అలాగే వీటిని తీసుకుంటే అధిక రక్తపోటు, నిద్రలేమి (Insomnia), అలసట, జుట్టురాలడం, తలనొప్పి (Headache) వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక ప్రతి రోజూ ఉదయాన్నే మొలకెత్తిన సెనగలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.