ఈ పువ్వులు కూడా బీపీని తగ్గిస్తయ్ తెలుసా?
మునగకాయలతో, మునగ ఆకులతో మన ఆరోగ్యానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలుసు. అయితే వీటితో పాటుగా మునగ పువ్వులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఈ పువ్వులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎన్నో ప్రమాదకరమైన రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా హై బీపీ, స్ట్రోక్, గుండె జబ్బులు చాలా కామన్ వ్యాధులుగా మారిపోయాయి. ఇలాంటి రోగాలు రాకూడదంటే మీ జీవన శైలి మెరుగ్గా ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని మునగపువ్వులు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. మునగపువ్వులను ఉపయోగించి ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాలు సమృద్ధిగా..
మునగపువ్వులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు రక్తనాళాల గోడలను సడలిస్తాయి. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు
మునగ పువ్వులు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. వీటిలో బీటా కెరోటిన్, క్లోరోజెనిక్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని మంటను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.
Drumstick flowers
మెరుగైన రక్త ప్రవాహం
మునగ పువ్వుల్లో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్త నాళాలను పెంచడానికి సహాయపడతాయి. దీంతో రక్తప్రవాహం మెరుగుపడుతుంది. ఫలితంగా ధమనుల గోడలపై ఒత్తిడి తగ్గుతుంది.
సోడియం తగ్గుదల
మన శరీరంలో ఉప్పు ఎక్కువ మొత్తంలో ఉంటే బీపీ అమాంతం పెరుగుతుంది. అయితే ముగనపువ్వులు మీ శరీరంలో సోడియం లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఈ పువ్వులు కిడ్నీల్లో సోడియం నిల్వ ఉండకుండా చేస్తుంది. దీంతో మీ అధిక రక్తపోటు తగ్గుతుంది.
తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే కూడా రక్తపోటు బాగా పెరుగుతుంది. అయితే మునగపువ్వులు ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
శోథ నిరోధక ప్రభావాలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. దీర్ఘకాలిక మంట కూడా రక్తపోటును పెంచుతుంది. మునగ పువ్వులలోని శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలలో మంటను తగ్గిస్తాయి. దీంతో మీ బీపీ నార్మల్ అవుతుంది.