MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Health
  • ఉదయం లేచిన వెంటనే నీళ్లను ఖచ్చితంగా తాగండి.. ఎందుకంటే?

ఉదయం లేచిన వెంటనే నీళ్లను ఖచ్చితంగా తాగండి.. ఎందుకంటే?

రోజూ పుష్కలంగా నీటిని తాగకపోవడం వల్ల తలనొప్పి, అలసటతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ తలనొప్పికి అతిపెద్ద కారణమంటున్నారు నిపుణులు. నీటిని పుష్కలంగా తాగడం వల్ల తలనొప్పిని నివారించడమే కాకుండా నోటి దుర్వాసన, ఇతర దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 08 2023, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరగడుపున నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు తెలుసా? పరగడుపున నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ముఖ్యంగా ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల పేగులు శుద్ధి అవుతాయి. ఇది జీర్ణశయాంతర ప్రేగులను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దీంతో మీరు శక్తివంతంగా ఉంటారు. మీకు తెలుసా? మనం నీళ్లను సరిగ్గా తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 
 

37

క్రమం తప్పకుండా నీటిని సరిగ్గా తాగకపోవడం వల్ల తలనొప్పి రావడం సహజమంటున్నారు నిపుణులు. ఎందుకే డీహైడ్రేషన్ తలనొప్పికి దారితీస్తుంది. నీటిని పుష్కలంగా తాగడం తలనొప్పి రాదు. అంతేకాదు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అలాగే దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 
 

47

ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల కూడా జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ అలవాటును కూడా మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం నిద్రలేవగాన్నే ఒక గ్లాస్ నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

57

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో కూడా నీరు మంచి మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు నీటిని తాగడం వల్ల చర్మం అందంగా మెరిసిపోతుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి ఇదొక  గొప్ప మార్గం. చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. చర్మం ముడతలు పడటానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు.

67

జుట్టు రాలడం, చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొనే వారికి కూడా ఈ అలవాటు ప్రయోజనకరంగా ఉంటుంది. మన శరీరానికి సరిపడా నీరు అందకపోతే జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. ఖాళీ కడుపుతో నీటిని తాగడం మీ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ శరీరానికి తగినంత నీరు అందకపోతే మీ జుట్టు మూలాలు పొడిగా, పెళుసుగా మారతాయి. ఇది హెయిర్  ఫాల్ కు దారితీస్తుంది.

77

నిజానికి నిర్జలీకరణం ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అందులో ఒకటి చర్మ సమస్య. నిర్జలీకరణం అకాల ముడతలకు కారణమవుతుంది. పరిగడుపున నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యం బాగుంటుంది. వాటర్ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీంతో మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved