చలికాలంలో గోరువెచ్చని నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?
చలికాలంల షురూ అయ్యిందంటే చాలు జలుబు, గొంతునొప్పి, ఛాతి బిగుసుకుపోవడం, చలిజ్వరం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సీజన్ లో గోరువెచ్చని నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?
వయోజన పురుషుల శరీరంలో 65% నీరు, ఆడవారి శరీరంలో 52% నీరు ఉంటుంది. ఇది మనం బతకడానికే కాదు.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా చాలా అవసరం. నీరు మన శరీరం లోపలి భాగాన్ని శుభ్రపరచడానికి చాలా అవసరం. నీరు కూడా మన శరీరానికి ఆక్సిజన్ అందించే పని చేస్తుంది. అయితే చాలా మంది చలికాలంలో నీటిని అస్సలు తాగరు. ఎందుకంటే ఈ సీజన్ లో దాహంగా అనిపించదు. అలాగే చాలా మంది ఈ సీజన్ లో చలి, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల బారిన ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సీజన్ లో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటిని ఖచ్చితంగా తాగాలి. చలికి చల్లనీటిని తాగాలనిపించదు. అందుకే గోరువెచ్చని నీటిని తాగండి. గోరువెచ్చని నీరు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది తెలుసా? చలికాలంలో గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ నిద్రలేచిన వెంటనే ఒకటి నుంచి రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని ఖచ్చితంగా తాగండి. ఇది మీ పొట్టను బాగా శుభ్రపరుస్తుంది. అలాగే మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. మీ బరువును కూడా నియంత్రించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
warm water
వాతావరణం మారితే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు రావడం సర్వసాధారణం అయ్యింది. అందుకే మీరు ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా గోరువెచ్చని నీటిని తాగండి. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
రోజూ టీ తాగే అలవాటుంటే.. దానికి బదులుగా గోరువెచ్చని నీటితో మీ రోజును స్టార్ట్ చేయండి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది.
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మన శరీరంలోని ఎన్నో విధులకు అవసరం.
గోరువెచ్చని నీరు మన చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ ను తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. అలాగే మొటిమల సమస్య కూడా ఉండదు.
చలికాలంలో గోరువెచ్చని నీటిని తాగితే ఛాతీ బిగుతు అనే సమస్యే ఉండదు.
గోరువెచ్చని నీటిని తాగితే పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, తిమ్మిరికి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.