MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం అలవాటు చేసుకుంటే..!

పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం అలవాటు చేసుకుంటే..!

పసుపు గుండె జబ్బులు, క్యాన్సర్, వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండే పసుపు పాలు శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పాలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. ఎందుకంటే పాలు మన దంతాలను, ఎములను బలంగా ఉంచుతాయి. అంతేకాదు శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. కానీ పాలలో చిటికెడు పసుపును కలిపి తాగడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పసుపులోని కర్కుమిన్ కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ పసుపు గుండె జబ్బులు, క్యాన్సర్, వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

యాంటీ ఏజింగ్

పసుపు ఒక అద్భుతమైన యాంటీ ఏజింగ్ సప్లిమెంట్. ఇది మన చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ ఛాయను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. 

37

మెరుగైన రక్తప్రసరణ

పసుపు మన రక్త నాళాలను శుద్ధి చేస్తుంది. అలాగే శరీరమంతా రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి సహాయపడుతుంది. అందుకే ఇది చర్మాన్ని శుద్ధి చేసే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
 

47

బ్లాక్ హెడ్స్ 

పసుపు నేచురల్ యాంటీ సెప్టిక్. పసుపు పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల ముఖంపై మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఏర్పడకుండా ఉంటాయి. ఉన్న నల్ల మచ్చలు కూడా పోతాయి. 
 

57

బరువు తగ్గడానికి

పసుపు పాలు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయంటున్నారు నిపుణులు. పసుపు పాలలో బరువు తగ్గడానికి అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఇతర పదార్థాలు పుష్కలంగా  ఉంటాయి. 

67

ట్యాక్సిన్స్ తొలగిపోతాయి

రాత్రి ముందు ఒక గ్లాసు పసుపు పాలను తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. 

కాలెయ ఆరోగ్యం

పసుపులో నిర్విషీకరణ, హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

77

విటమిన్లకు మంచి మూలం

పసుపు పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాదు ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగితే ఎన్నో పోషకాల లోపం పోతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image3
Summer Skin Care: మండే ఎండల్లోనూ మెరిసే చర్మం.. ఇదొక్కటి చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved