MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • వేడి వేడి వెల్లుల్లి టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా? శరీరంలో జరిగే ముఖ్యమార్పులు ఇవే!

వేడి వేడి వెల్లుల్లి టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా? శరీరంలో జరిగే ముఖ్యమార్పులు ఇవే!

అందరి వంటింటిలో అందుబాటులో ఉండే వెల్లుల్లిలో (Garlic) ఔషధ గుణాలు (Medicinal properties) మెండుగా ఉంటాయి. 

2 Min read
Author : Navya G
Published : May 25 2022, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
garlic tea

garlic tea

ఇవి ఆరోగ్యానికి కలుగచేసే ప్రయోజనాలు బోలెడు. ఇది వంటలకు రుచిని అందించడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా సహాయపడుతుంది. అయితే వెల్లుల్లితో చేసుకునే టీ ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
garlic tea

garlic tea

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను (Toxic substances) బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బాడీ మెటబాలిజాన్ని (Metabolism) కూడా మెరుగుపరుస్తాయి. కనుక సాధారణ కాఫీ, టీ లకు బదులుగా వెల్లుల్లి టీ ను తీసుకోవడం మంచిది.

38
garlic tea

garlic tea

వెల్లుల్లి టీ తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నీళ్లు, ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని వడగట్టి ఒక గ్లాసులో తీసుకొని కొంచెం తేనె (Honey) లేదా నిమ్మరసం (Lemon juice) కలుపుకుని తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ వెల్లుల్లి టీని చేసుకొని తాగితే శరీర ఆరోగ్యం మెరుగుపడి జీవితకాలం పెరుగుతుంది.

48
garlic tea

garlic tea

వెల్లుల్లి టీ తాగితే జీర్ణశక్తి (Digestion) మెరుగుపడుతుంది.  దీంతో తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకం (Constipation) వంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యలను తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుతుంది. కనుక బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ వెల్లుల్లి టీని తీసుకోవడం మంచిది.

58
garlic tea

garlic tea

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండె జబ్బులకు (Heart disease) దూరంగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.

68
garlic tea

garlic tea

వాతావరణంలోని మార్పుల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్లను (Infections) తగ్గించడానికి చక్కటి పరిష్కారంగా వెల్లుల్లి టీ సహాయపడుతుంది. కనుక జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక కప్పు వెల్లుల్లి టీని తాగడం మంచిది. అలాగే అజీర్తి, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించి ఉదర ఆరోగ్యాన్ని (Abdominal health) మెరుగుపరుస్తుంది.

78
garlic tea

garlic tea

అంతే కాకుండా ఈ టీని తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో  డయాబెటిస్ (Diabetes) సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వెల్లుల్లిలో ఉండే పోషకాలు శరీర వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచి శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.
 

88
garlic tea

garlic tea

దీంతో అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) దరిచేరకుండా ఉంటాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) కలిగించే వెల్లుల్లిని ఏదో విధంగా శరీరానికి అందిస్తే ఆరోగ్యంగా ఉండి జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved