మీరు రోజూ గ్రీన్ టీ తాగుతరా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!
గ్రీన్ టీ లో కెఫిన్ తో పాటుగా ఎపిగల్లోకాటెచిన్ గాలెట్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ కెఫిన్ మనల్ని యాక్టీవ్ గా ఉంచడంతో పాటుగా కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది.
Image: Freepik
పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీ నే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది గ్రీన్ టీ కి బదులుగా పాలు, పంచదార కలిపిన టీ, కాఫీలనే ఎక్కువగా తాగుతుంటారు. నిజానికి ఈ గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
green tea
గ్రీన్ టీలో కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఒక రకమైన ఫ్లేవనాయిడ్. ఈ కాటెచిన్లు ధమనులలో ఫలకాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో లిపిడ్ ప్రొఫైల్స్ ను మెరుగుపరచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
green tea
2016 లో జరిపిన పలు అధ్యయనాల ప్రకారం.. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగిన వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. గ్రీన్ టీ ని రోజూ తాగడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
green tea
గ్రీన్ టీలో కెఫిన్, ఎపిగల్లోకాటెచిన్ గాలేట్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ గ్రీన్ లో ఉండే కెఫిన్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది నోర్పైన్ఫ్రైన్ వంటి కొన్ని కొవ్వు తగ్గించే హార్మోన్ల ప్రభావాలను పెంచుతుంది.
green tea
గ్రీన్ టీ ని తాగడం వల్ల శరీర బరువు, ఊబకాయం, బాడీ మాస్ ఇండెక్స్, బొడ్డు కొవ్వు తగ్గుతాయని 2020 లో ఒక అధ్యయనం చెబుతోంది. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) ఉన్న మహిళల్లో గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని మరో అధ్యయనం తెలిపింది.
గ్రీన్ టీలో కెఫిన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది చురుకుదనం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు దీనిలో ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది డోపామైన్, సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
గ్రీన్ టీ మన మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళనను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. అంతేకాదు ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. శ్రద్ధను పెంచుతుంది. అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడెజెనరేటివ్ రుగ్మతలకు చికిత్స చేయడానికి, నివారించడానికి సహాయపడే సమ్మేళనాలు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి.