MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • పరిగడుపున సోంపు నీటిని తాగితే.. ఈ సమస్యలన్నీ మాయం..!

పరిగడుపున సోంపు నీటిని తాగితే.. ఈ సమస్యలన్నీ మాయం..!

ప్రతిరోజూ పరగడుపున సోంపు నీటిని తాగడం మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇది మనకు ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 11 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సోంపు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత. సోంపు గింజల్లో బరువును నియంత్రించడానికి సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆకలిని నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఎలా అంటే ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఉదయం పరిగడుపున సోంపు నీటిని తాగితే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సోంపు ఎన్నో ఔషధ గుణాలను కలిగిన ఉన్న మసాలా దినుసు. సోంపు గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ మసాలా దినుసుల్లో స్థూల, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, సెలీనియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
 

36

పరగడుపున సోంపు గింజల నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం నుంచి ఉపశమనం పొందుతారు. ఈ వాటర్ జీర్ణ ప్రక్రియను ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణశయాంతర ప్రేగు మొత్తం ఆరోగ్యానికి మద్దతునిస్తుంది.
 

46

సోంపు గింజల్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
 

56

సోంపులో కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. సోంపులో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే మరొక యాంటీఆక్సిడెంట్.
 

66
Image: Pexels

Image: Pexels

సోంపులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా ఆమ్ల సమతుల్యతను నియంత్రించడానికి, రక్తపోటును స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. సోంపు గింజలను నమలడం వల్ల రక్తపోటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved