MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • మీరు రోజూ చాక్లెట్ తింటరా? అయితే ఈ సంగతి తెలుసుకోవాల్సిందే..!

మీరు రోజూ చాక్లెట్ తింటరా? అయితే ఈ సంగతి తెలుసుకోవాల్సిందే..!

చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ ను తినే వారు చాలా మందే ఉన్నారు. కొంతమందైతే ప్రతిరోజూ వీటిని తింటుంటారు. మరి ఇలా తింటే ఆరోగ్యం ఎలా అవుతుందో తెలుసా?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చాక్లెట్లను పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటుంటారు. నిజానికి డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కోకో మొక్క విత్తనాల నుంచి తయారయ్యే డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది స్త్రీ పురుషుల్లో లైంగిక కోరికలను కూడా పెంచుతుంది. మరి డార్క్ చాక్లెట్ ను రోజూ తినడం వల్ల ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పోషకాల భాండాగారం

డార్క్ చాక్లెట్లు పోషకాలకు మంచి వనరు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. డార్క్ చాక్లెట్ లో మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. 

 

38

అధిక రక్తపోటు

యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్ ను మోతాదులో రోజూ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెపోటు, ఇతర గుండె  సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

48

గుండె ఆరోగ్యం

డార్క్ చాక్లెట్లు మన గుండెను రక్షించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ చాక్లెట్ మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఈ కొలెస్ట్రాల్ గుండెకు రక్తప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు వస్తాయి. 
 

58

బ్లడ్ షుగర్

డయాబెటిస్ పేషెంట్లు డార్క్ చాక్లెట్లను ఎలాంటి మొహమాటం లేకుండా తినొచ్చు. ఎందుకంటే డార్క్ చాక్లెట్ లోని కోకో ప్రయోజనాలు మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 
 

68

ఒత్తిడి, డిప్రెషన్ 

డార్క్ చాక్లెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వీటిని రోజూ మోతాదులో తింటే ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.
 

78

వెయిట్ లాస్

డార్క్ చాక్లెట్లు మన బరువును తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్లను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు ఎక్కువగా తినలేరు. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

88

చర్మ ఆరోగ్యం

డార్క్ చాక్లెట్ లో బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఇది చర్మంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved