వర్షాకాలంలో చాయ్ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
చల్లని వాతావరణంలో ఒక కప్పు వేడి వేడి టీ తాగడం వల్ల వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అందుకే చిరుజల్లులు పడుతున్నప్పుడు టీని తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. నిజానికి చాయ్ కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది తెలుసా?

వర్షాకాలంలో ఒక కప్పు గోరువెచ్చని కప్పు అల్లం టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది ఈ సీజన్ లో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. వర్షాకాలంలో అల్లం టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది రోగాలతో పోరాడేందుకు మీ శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ
చాయ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్థి వంటి జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో ఆయిలీ ఫుడ్ ను తినడం వల్ల ఈ జీర్ణ సమస్యలు వస్తాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ
చాయ్ లో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే కండరాల నొప్పులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే తేమ, చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి.
వార్మింగ్ ఎఫెక్ట్
అల్లం లో శరీరాన్ని వేడిక్కించే గుణాలు ఉంటాయి. ఈ టీ ని తాగడం వల్ల శరీరం వేడిక్కిన అనుభూతి కలుగుతుంది. ఇది వర్షాకాలం చలి, తేమను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.