MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Health
  • నల్ల బియ్యంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు తెలుసా?

నల్ల బియ్యంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు తెలుసా?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వ్యవసాయ రంగంలోనూ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పాలి. ఈ క్రమంలోనే రైతుల సైతం సరికొత్త వంగడాలను పండిస్తూ ప్రజలకు ఆహార పదార్థాలుగా అందిస్తున్నారు. అయితే దేశం మొత్తం ఎక్కువగా ఆధారపడే వరిలో కూడా సరికొత్త వంగడాలను పండిస్తున్నారు. ఈ క్రమంలోనే వరిలో నల్ల బియ్యం ఆరోగ్య ప్రయోజనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పాలి. నల్ల బియ్యంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కనుక తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. 

1 Min read
Author : Navya G
Published : Nov 04 2022, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నల్ల బియ్యంలో ఎన్నో పోషక పదార్థాలు ఉండటం వల్ల ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నల్లబియ్యంలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటితోపాటు నియాసిన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, జింక్ ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా నల్లబియ్యంలో ఆంథోసైనిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి మనకు విముక్తి కలిగించేలా చేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నల్లబియ్యంలో లభించే ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోకెమికల్స్‌ డయాబెటిక్‌ వ్యాధివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచి మన శరీరానికి అనుగుణంగా గ్లూకోజ్ ఉపయోగించుకోవడం కోసం అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతగానో దోహదపడుతుంది. అందుకే డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు నల్ల బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 

34

మనం ప్రతిరోజు ఒకసారి ఈ బ్లాక్ రైస్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి 60 శాతం ఐరన్ 40% ఫైబర్ అందిస్తుంది.ఇక ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా మెరుగుపరుస్తుంది.అదేవిధంగా మన శరీరంలోకి ప్రవేశించే హానికర బ్యాక్టీరియాలతో పోరాటం చేసి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ను బయటకు తొలగించడానికి ఇందులో ఉన్నటువంటి పోషకాలు దోహదం చేస్తాయి.
 

44

ఇక ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది తద్వారా కార్డియోవాస్కులర్‌ వ్యాధుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. నల్ల బియ్యంలో ఉండే జియాక్సాంటిన్‌, లుటిన్‌.. కెరోటినాయడ్స్‌ ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మన శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తూ రక్తపోటు సమస్య నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. బ్రౌన్ రైస్ తో పోలిస్తే బ్లాక్ రైస్ లో ఎలాంటి కొలెస్ట్రాల్ లేకుండా ప్రోటీన్లను అధికంగా కలిగి ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved