రోజూ అరటిపండ్లను తింటున్నారా?
అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకనే వీటిని చాలా మంది రోజూ తింటుంటారు. అరటిపండ్లను తినడం వల్ల ఎసిడిటీ వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.

banana
అరటిపండ్లు చాలా చవకగా లభిస్తాయి. ఈ పండ్లను కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. నిజానికి అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అరటి పండ్లలో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, ఫోలేట్ మొదలైనవి అందుతాయి. రోజుకు ఒక అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
banana
అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడపు సమస్యలతో బాధపడే వారికి బాగా సహాయపడుతుంది. ఇది మీ జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉదయం పూట అరటిపండ్లు తినడం వల్ల ఎసిడిటీ తగ్గిపోతుంది. దీని నుంచి వచ్చే యాసిడ్ రిఫ్లక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అరటిపండ్లు ఎసిడిటీని నివారించడానికి సహాయపడతాయి. మలబద్దకాన్ని నివారించడానికి కూడా అరటిపండ్లు ఎంతో సహాయపడతాయి. అరటిపండ్లను ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగిన తర్వాత వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
banana
అరటిపండ్లు మెదడు పనితీరుకు కూడా మేలు చేస్తాయి. ఈ పండ్లు మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను ఊబకాయాన్ని నియంత్రించడానికి కూడా తినొచ్చు.
banana
పొటాషియం పుష్కలంగా ఉండే అరటిపండ్లు అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. రోజుకు ఒక అరటిపండును డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అరటిపండ్లలో పెక్టిన్ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి అరటిపండ్లను కూడా తినొచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు అరటిపండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. అరటిపండు రక్తహీనతను నివారిస్తుంది. కళ్లు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే అరటిపండ్లు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.