MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పరిగడుపున తులసి వాటర్ ను తాగడం వల్ల బోలెడు లాభాలున్నాయి తెలుసా?

పరిగడుపున తులసి వాటర్ ను తాగడం వల్ల బోలెడు లాభాలున్నాయి తెలుసా?

తులసి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులురోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. పరగడుపున తులసి వాటర్ ను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా?

Mahesh Rajamoni | Updated : Jul 30 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
tulsi water

tulsi water


తులసి ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. అందుకే తులసిని ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పరగడుపున తులసి ఆకులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరం నుంచి అవాంఛిత కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.

తులసి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు నిపుణులు. 
 

25
thulsi water

thulsi water

తులసి ఆకుల్లో అడాప్టోజెన్లు కూడా ఉంటాయి. ఇది శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన రక్త ప్రసరణను పెంచడానికి కూడా సహాయపడుతుంది.

డయాబెటిస్ పేషెంట్లు పరిగడుపున తులసి నీటిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి తులసి టీ గ్రేట్ గా సహాయపడుతుంది. తులసి టీని రోజూ తాగడం వల్ల కార్బోహైడ్రేట్లు, కొవ్వుల రసాయన మార్పిడికి సహాయపడుతుంది.

35
Asianet Image

ఈ తులసి వాటర్ జలుబు, దగ్గు, బ్రోన్కైటిస్, ఉబ్బసం వంటి కొన్ని శ్వాసకోశ వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గును వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థకు ఉపశమనం కలిగించడానికి శ్లేష్మాన్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది.

తులసి ప్రేగు కదలికను కూడా మెరుగుపరుస్తుంది. తులసి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణక్రియను సులభతరం అవుతుంది. అంతేకాదు తులసి వాటర్ యాసిడ్ రిఫ్లెక్స్లను సమతుల్యం చేస్తుంది అలాగే ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్ధారించడానికి పిహెచ్ స్థాయిని మెరుగ్గా ఉంచుతుంది. 
 

45
Asianet Image


తులసిలో ప్యాంక్రియాటిక్ కణాల పనితీరుకు తోడ్పడే పదార్థాలు కూడా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడే ఎక్కువ ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. తులసి కార్బోహైడ్రేట్లు, కొవ్వుల జీవక్రియను సులభతరం చేస్తుంది.

తులసిలో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది బీపీని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తులసిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు జలుబును తొందరగా తగ్గించడానికి, నివారించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేయడానికి కూడా సహాయపడతాయి.
 

55
Asianet Image

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. అందుకే ఇది శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడుతుంది.

పరగడుపున తులసి నీటిని తాగడం వల్ల రక్తంలోని టాక్సిన్స్ బయటకుపోతాయి. మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. తులసిలో కార్సినోజెనిక్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇది నోటి, రొమ్ము క్యాన్సర్ కు కారణమయ్యే క్యాన్సర్ కణాల అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories