ఆ గింజలు కొన్ని రోజులు తింటే చాలు.. అందం, ఆరోగ్యం మీ సొంతం!
చర్మసౌందర్యానికి సహజసిద్ధమైన పదార్థాలతోపాటు అవిసె గింజలతో కూడా అనేక ప్రయోజనాలను కలుగజేస్తాయని అధ్యయనంలో తేలింది. అవిసె గింజలు (Flax seeds) ఎన్నో పౌష్టిక విలువలను (Nutritional values) కలిగి ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మంచి నిగారింపును అందిస్తాయి. ఇక ఈ ఆర్టికల్ ద్వారా ఈ గింజలతో చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (Omega-3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్య, సౌందర్యానికీ సహాయపడతాయి. ఇవి చర్మానికి తగినంత తేమను అందించి చర్మాన్ని కోమలంగా మారుస్తాయి. చర్మకణాలలో (Skin cells) పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మం పై మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి చర్మ నిగారింపును పెంచుతాయి.
మొటిమలను తగ్గిస్తాయి: ముఖంపై మొటిమలు ఏర్పడడానికి కారణం జిడ్డు. అయితే అవిసె గింజలు చర్మ గ్రంథులు (Skin glands) ఉత్పత్తి చేసే జిడ్డు పదార్థం సిబం ఉత్పత్తిని అడ్డుకుంటాయి. దీంతో ముఖం పై మొటిమలు (Acne) ఏర్పడవు. ఇందుకోసం ప్రతి రోజూ రెండు స్పూన్ ల అవిసె గింజలను తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
చర్మ వ్యాధులను నిరోధిస్తాయి: చర్మం ఇన్ఫెక్షన్ (Infection) బారిన పడినప్పుడు చర్మం పొడిబారి సోరియాసిస్, తామర, గజ్జి, బొల్లి సమస్యలు ఏర్పడుతాయి. ఇటువంటి చర్మ సమస్యలను నిరోధించడానికి అవిసె గింజల నూనె దివ్యౌషధంగా సహాయపడుతుంది. ఈ చర్మ వ్యాధులు ఉన్న ప్రదేశంలో అవిసె గింజల నూనెను మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవిసె గింజలలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ క్యాన్సర్లను (Skin cancers) సైతం నిరోధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ముడతలను తగ్గిస్తుంది: వయసు పైబడటంతో ముఖంపై ముడతలు ఏర్పడతాయి. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఒక కప్పులో ఒక టీస్పూన్ అవిసె గింజల నూనె (Flax seeds oil), ఒక టీస్పూన్ నిమ్మరసం (Lemon juice), రెండు టేబుల్ స్పూన్ ల తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
స్క్రబ్ గా ఉపయోగపడుతుంది: చర్మంలో ఉండే మృత కణాలను (Dead cells) తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచడానికి అవిసె గింజల పొడి మంచి స్క్రబ్ (Scrub) గా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక కప్పులో అవిసె గింజల పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం తాజాగా మారుతుంది.