MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ పండ్లను తిన్నా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది తెలుసా?

ఈ పండ్లను తిన్నా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది తెలుసా?

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే ఊబకాయంతో పాటుగా గుండెపోటు వంటి ఎన్నో గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని పండ్లు. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 21 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
cholesterol

cholesterol

కొలెస్ట్రాల్ పెరగడమనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఎందుకంటే ఇది మనల్నిసులువుగా చంపేస్తుంది.  మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండు చెడు కొలెస్ట్రాల్ . శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అవసరం. కానీ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి.

27
Cholesterol

Cholesterol

ఇది మనల్ని ఊబకాయం బారిన పడేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని నియంత్రించడం చాలా అవసరం. అయితే కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 
 

37

అవొకాడో

అవొకాడోలో పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవొకాడోల నుంచి వచ్చే ఫైబర్స్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను, ల్డిఎల్ కొలెస్ట్రాల్ నాణ్యతను మెరుగుపరుస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్తాయిలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు అవోకాడోలను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

47
apples

apples

ఆపిల్స్

ఆపిల్స్ లో పెక్టిన్ ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు. ఆపిల్ పండు అనారోగ్యకరమైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధమనులు గట్టిపడకుండా నిరోధించడానికి కూడా ఈ పండు సహాయపడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

57

సిట్రస్ పండ్లు

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లలో హెస్పెరిడిన్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటు లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఈ పండ్లు మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.
 

67

బొప్పాయి

బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 

77
banana

banana

అరటిపండ్లు

అరటి పండ్లలో ఉండే ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. అరటిపండ్లు కరిగే ఫైబర్స్ కు మంచి మూలం. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మీకు తక్షణ శక్తిని అందిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఎక్కువ ఖర్చు లేకుండా జుట్టు అందంగా పెరగాలా? ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటే చాలు
Recommended image2
Early Wake Up: 10 రోజులపాటు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Hair Care Tip: రోజూ ఇదొక్కటి తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved