చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తోందా? కారణం ఇదే కావొచ్చు
వయస్సు, జీవనశైలి, ఆహారం వంటివి కూడా మూత్రం ఎక్కువ సార్లు రావడానికి కారణమవుతుంది. రోజుకు నాలుగైదు సార్ల కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళితే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Urinary
చలికాలంలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం చాలా సాధారణం. దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రోజుకు నాలుగైదు సార్లు మూత్ర విసర్జన చేయవలసి వచ్చినా.. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చలికాలంలో మనం ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటాం.
నిజానికి ఎండాకాలంలో మనం తాగే వాటర్ చాలావరకు మూత్రం, చెమట రూపంలో బయటకు పోతుంది. కానీ చలికాలంలో మన జీవనశైలి చాలా వరకు మారుతుంది. ఈ సమయంలో మన శరీరం చల్లగా ఉంటుంది. అలాగే శరీరానికి చెమట కూడా పట్టదు. ఇలాంటప్పుడు మనం ఏ నీరు తాగినా అది మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇందుకే మనం మళ్లీ మళ్లీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది కాకుండా తక్కువ రోగనిరోధక శక్తి లేదా ప్రమాదకరమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. మరి చలికాలంలో ఎక్కువ సార్లు మూత్రం రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డయాబెటిస్ మెల్లిటస్
డయాబెటీస్ వ్యాధి ఉన్నవారు కూడా ఎక్కువ సార్లు మూత్రానికి వెళతారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీరంలో ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. డయాబెటీస్ ఉంటే రోజుకు 7 నుంచి 10 సార్లు మూత్ర విసర్జన చేస్తారు. అంటే వీళ్లు టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడొచ్చు.
urine
నీరు ఎక్కువగా తాగడం
మన శరీరానికి నీరు చాలా చాలా అవసరం. నీటితోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నీళ్లను మరీ ఎక్కువగా తాగితే కూడా సమస్యే. ఎందుకంటే నీరు పదేపదే తాగడం వల్ల మూత్రం ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల కూడా మీరు పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
గుండె వైఫల్యం
కొన్ని అరుదైన సందర్భాల్లో గుండె వైఫల్యంతో సంబంధం ఉన్న ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు కూడా మూత్రం ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల కూడా మీరు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
urine
మూత్రపిండాల సమస్యలు
ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రావడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే మూత్రపిండాల సమస్యలు కూడా తరచుగా మూత్ర విసర్జన సమస్యలను కలిగిస్తాయి.
గర్భధారణ
ఫ్రెగ్నెన్సీ సమయంలో కూడా మూత్రం తరచుగా వస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రోజుకు చాలా సార్లు మూత్ర విసర్జన చేస్తాయి.
ఇన్ఫెక్షన్లు
మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి వివిధ వ్యాధులు, చికిత్సలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. మీకు తరచుగా మూత్రవిసర్జన సమస్య ఉంటే లేదా దానితో సంబంధం ఉన్న ఇతర లక్షణాలను మీరు గమనించినట్టైతే హాస్పటల్ కు వెళ్లండి. అయితే తరచూ మూత్రం వస్తుంది కదా అని మీకు మీరే నిర్దారించుకోకండి. హస్పటల్ కు వెళ్లినాకనే దీని నిర్దారించుకోండి.