Health Tips: మీ కాళ్ళలో ఈ లక్షణాలు కనబడుతున్నాయా.. అయితే కచ్చితంగా మీకు షుగర్ ఉన్నట్టే!
Health Tips: శరీరంలో డయాబెటిస్ ఉందో లేదో కాళ్ళని చూసి చెప్పేయవచ్చు. కాళ్ళల్లో వచ్చే మార్పును గమనిస్తే షుగర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మీ పాదాలకు చెమట పట్టకపోతే మీకు మధుమేహం ఉన్నట్లు సంకేతం. మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ పాదాల్లో చెమటలు పట్టకపోతే కొంచెం ఈ విషయం గా దృష్టి పెట్టండి. ఎందుకంటే మధుమేహానికి ఇది ఉత్తమ సంకేతం. అలాగే కాళ్లు ఎర్రగా కనిపించిన కాస్త జాగ్రత్త పడండి.
శరీరంలో గ్లూకోజ్ స్థాయిలో ఎక్కువగా ఉంటే కాళ్లు ఎర్రగా మారుతాయి. కాబట్టి మీ ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కాలికి ఏదైనా గాయం అయినప్పుడు సాధారణంగా త్వరగా మానిపోతుంది.
కానీ మధుమేహం ఉంటే గాయం ఎన్నటికీ మానదు సరి కదా రక్త ప్రవాహం గడ్డ కట్టదు. మీ కాళ్ళలో గనక ఈ లక్షణం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం మంచిది. అలాగే గోళ్ళు రంగులో మార్పు ని కూడా గమనించండి. గోళ్ళు పసుపు రంగులో ఉంటే శరీరంలో మధుమేహం స్థాయి చాలా ఎక్కువగా ఉందని అర్థము. అలాగే కాలు మీద చర్మం మందంగా అనిపించినా కూడా మధుమేహానికి సంకేతమే.
అలాగే వాతావరణాన్ని బట్టి పాదాలు వెచ్చగాను, చల్లగాను అవుతూ ఉంటాయి. మీ పాదాలు నిరంతరం వేడిగా ఒకే స్థితిలో ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మధుమేహం స్థాయి ఎక్కువగా ఉందని అర్థం. వెంటనే అలర్ట్ అవ్వవలసిన సమయం అని గుర్తించండి.
షుగర్ ఉన్న మనుషులకి దోమలు కుడితే దురద ఎక్కువగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాన్ని మీరు గమనించినట్లయితే షుగర్ ఉన్నట్టే లెక్క. అందులో సందేహం లేదు అలాగే మధుమేహం ఉన్న వాళ్ళకి పాదాలు విపరీతంగా నొప్పిని కలిగి ఉంటారు
మీకు రెండు కాళ్లలో నొప్పులు వస్తుంటే మీరు ప్రీడయాబెటిస్ ప్రారంభమైంది అనేది సంకేతం. అలాగే తీవ్రమైన తిమ్మెర్లు అనేక వ్యాధుల లక్షణాలలో ఒకటి. కాళ్లలో విపరీతమైన జలదరింపు ఉంటే అది కూడా శరీరంలో మధుమేహానికి సంకేతం. ఈ లక్షణాలలో ఏ ఒక్కటి మీకు కనిపించినా అశ్రద్ధ చేయకండి.